విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
పాలామూరు యూనివర్శిటి ,మేజర్ న్యూస్ --
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల సామాజిక సేవా విభాగం ఎం.ఎస్.డబ్ల్యూ. ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ రోజు మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లి వద్ద ఉన్న టచ్ స్వచ్ఛంద సంస్థను సందర్శించారు. విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. గాలెన్న పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ వినయ్ సంస్థ లక్ష్యాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, సమాజ అభివృద్ధికి అందిస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు. పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, సామాజిక దురాచారాల నివారణ, అణగారిన వర్గాల అభ్యున్నతిలో సామాజిక కార్యకర్తల పాత్రను తెలియజేశారు.
ఈ క్షేత్ర సందర్శన ద్వారా విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల పనితీరు, సామాజిక సమస్యల పరిష్కార విధానాలు, క్షేత్రస్థాయిలో సామాజిక కార్యకర్తల బాధ్యతలపై ప్రత్యక్ష అవగాహన లభించింది.ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.డబ్ల్యూ. ప్రథమ సంవత్సరం విద్యార్థులు నంద కిషోర్, శివప్రసాద్, పి. అశోక్ కుమార్, వెంకటేష్, వీరేష్, శివకుమార్, బి. కళ్యాణ్, మున్నా మహేశ్వరి, శింధుప్రియ, జి. ప్రీతి కావ్య, ఎస్. శ్రీలత, కె. హరిత, డి. త్రివేణి, డి. భాగ్యలక్ష్మి, బి. అశ్విని, పి. హారుణి తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్ పాలమూరు యూనివర్సిటీ,మహబూబ్ నగర్