జగన్‌కు షాక్: నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని 'A కన్వెన్షన్' హాల్లో తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల తనకు తీవ్ర అవమానం జరిగిందని, బలవంతంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు ప్రధాన కుటుంబాల పాలన నుంచి ఏపీని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బలమైన మూడవ ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోబోతున్న ఈ కొత్త పార్టీని "జెన్ జీ (Gen Z) నాయకుల తయారీ ఫ్యాక్టరీ"గా తీర్చిదిద్ది యువతకు అగ్రతాంబూలం ఇస్తామని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయాలు పెంచడం, 100 శాతం యువతకు ఉపాధి కల్పించడం, ఉచిత విద్యుత్ వంటి అంశాలతో 10 సూత్రాల విధానాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాలను ఈ నెల 11న ఆవిష్కరించనున్న ఆయన, పార్టీ ప్రచారం కోసం "సాయన్న పేరులోనే సాయముందిరా" అనే సన్నాహక గీతాన్ని కూడా ఇప్పటికే విడుదల చేశారు.