BREAKING
టాలీవుడ్ నటి సంచలన అరెస్ట్.. డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిచి బెదిరించి దోపిడీ చేసిన అతుల్య చంద్ర! ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు! టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర. ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్! అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు! నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్ సిరిమాను సంబరాలలో శిరీష గానం అనంతపురం (వైఎస్సార్ సీపీ నాయకురాలు లీలావతి మృతి – అంజలి ఘటించిన మేయర్ రమేష్ గౌడ్ వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు

ఎంపీపీ పీఠం ఎవరి పరం.. మళ్లీ లాటరీ తప్పదా?

Select Suryaa Now
ఎంపీపీ పీఠం ఎవరి పరం.. మళ్లీ లాటరీ తప్పదా?

బాడంగి, సూర్య : బాడంగి మండల పరిషత్‌ అధ్యక్ష పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ, వైకాపాలు చెరో ఏడు ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడంతో లాటరీ ద్వారా ఎంపీపీ పదవి వైకాపాకు దక్కింది. అనంతరం అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో టీడీపీ పీఠాన్ని అధిష్ఠించింది. ఈసారి ఎవరి బలం ఎంత? అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
క్రాస్‌ ఓటింగ్‌పై ఊహాగానాలు!
తాజా ఎన్నికల్లో బాడంగి, బొత్సవానివలస ఎంపీటీసీ పరిధుల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగి ఉండవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బాడంగిలో టీడీపీ తరఫున ఒకే కుటుంబానికి చెందిన వారు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీలో ఉండటంతో ఓటర్లు రెండు ఎన్నికల్లో వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఉండవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బొత్సవానివలస పరిధిలోని హరిజన పాల్తేరు గ్రామానికి చెందిన వ్యక్తి వైకాపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడంతో అక్కడి ఓట్ల ప్రభావంపై కూడా చర్చ సాగుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాలు మాత్రమే. వాస్తవ పరిస్థితి ఫలితాల వెల్లడితోనే స్పష్టమవుతుంది.
ఎవరి లెక్కలు వారివే!
గతంలో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్న అనుభవంతో వైకాపా శ్రేణులు ఈసారి కూడా తమకు అనుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, మండలంలో టీడీపీకి ఉన్న రాజకీయ పునాది తమకు కలిసివస్తుందని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరు పక్షాలు తమదైన లెక్కల్లో నిమగ్నమయ్యాయి.
మళ్లీ లాటరీ తెరపైకి వస్తుందా?
మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాల ఫలితాలే ఎంపీపీ పీఠం భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఇరు పక్షాలకు సమాన సంఖ్యలో స్థానాలు దక్కితే మరోసారి లాటరీ ద్వారా అధ్యక్షుడి ఎంపిక జరిగే పరిస్థితి తలెత్తుతుందా? లేక ఏదైనా ఒక పక్షం స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాల అనంతరం వెలువడే రాజకీయ సమీకరణాలే బాడంగి మండల పరిషత్‌ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో తేల్చనున్నాయి. అదే సమయంలో జడ్పీటీసీ అభ్యర్థి గెలుపుపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు ఫలితాల వెల్లడితోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది.