BREAKING
ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు! టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర. ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్! అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు! నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్ సిరిమాను సంబరాలలో శిరీష గానం అనంతపురం (వైఎస్సార్ సీపీ నాయకురాలు లీలావతి మృతి – అంజలి ఘటించిన మేయర్ రమేష్ గౌడ్ వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు ఘనంగా రాజరాజేశ్వరి దేవికి పూజలు

పౌరసరఫరాల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Select Suryaa Now
పౌరసరఫరాల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ, తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో రెండు హోల్‌సేల్ దుకాణాలు, ఆరు రిటైల్ దుకాణాలు, ఒక రైస్ మిల్లును పరిశీలించారు.మార్కెట్‌లో బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందేలా చూడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రెండు వ్యాపార సంస్థలు బియ్యం బస్తాలపై ఉన్న అసలు ధరల లేబుళ్లను మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు