రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్‌కు లక్షన్నర ఆర్థిక సాయం అందజేసిన టిడిపి నాయకులు
కావలి , మేజర్ న్యూస్ : తలసేమియా బాధిత చిన్నారులకు కావలి రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న నిస్వార్థ సేవలు అత్యంత ప్రశంసనీయమని 21వ వార్డు (పాత 13వ వార్డు) టిడిపి నాయకులు కొనియాడారు. రెడ్ క్రాస్ పాలకమండలి ఆహ్వానం మేరకు శుక్రవారం వారు స్థానిక రెడ్ క్రాస్ తలసేమియా డే కేర్ సెంటర్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా చిన్నారుల చికిత్స, సంక్షేమం నిమిత్తం నాయకులు
ముమ్మిడిశెట్టి పృథ్వి కృష్ణ — రూ. 50,000/-
మన్నెమాల శ్రీనివాసులు రెడ్డి — రూ. 50,000/-
మెట్ట కోటిరెడ్డి — రూ. 50,000/- చొప్పున మొత్తం రూ. 1,50,000 ఆర్థిక సాయాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.అనంతరం కేంద్రంలో రక్తమార్పిడి చేయించుకుంటున్న చిన్నారులను, వారి తల్లిదండ్రులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పామూరు శ్రీధర్‌తో సమావేశమై చిన్నారులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వ్యాధుల బారిన పడిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు పడుతున్న వేదన తమను ఎంతగానోకలచివేసింద న్నారు. దాతల సహకారంతో బాధితులకు అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రక్తమార్పిడి, మందులు, పౌష్టికాహారాన్ని పూర్తిగా ఉచితంగా సమకూరుస్తున్న కావలి రెడ్ క్రాస్ బృందాన్ని వారు అభినందించారు. బాధిత చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కావలి రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ కె. హరినారాయణ రెడ్డి,డా.శ్రీధర్, నాయకులు ముమ్మిడి శెట్టి పృద్వి, మన్నెమాల శ్రీనివాస్ రెడ్డి, గాదంశెట్టి వంశీ, గాదంశెట్టి రాజేంద్ర, జలదంకి స్వామి, ప్రతి మహేష్, కురేటి శ్రీనివాసులు, బిట్రగుంట వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.