ఆత్మకూరులో ఏకగ్రీవంగా ఎంపీటీసీ మెంబర్గా ఎన్నికైన "కేతా "
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా చెర్లో ఎడవల్లి ఎంపిటిసి స్థానం నుండి మాజీ మండలాధ్యక్షుడు, జిల్లా మండలాధ్యక్షుల సంఘం మాజీ అధ్యక్షులు కేతా వేణుగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేణుగోపాల్ రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం సర్దుబాటుగా నామినేషన్ వేసిన ఇతర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో వేణుగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మండలంలో కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశంకు ఎంపీటీసీ పరిధి నుండి తొలి విజయంగా కేతా వేణుగోపాల్ రెడ్డి బోణీ చేశారు.