కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందిన ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభినందించారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే ఆరణి నివాసంలో ఆయనను నగర పరిధిలోని పలు డివిజన్లకు సంబంధించిన నూతన కార్పొరేటర్లు విజేతలైన కార్పొరేటర్ల ఆర్పీ శ్రీనివాస్, వరలక్ష్మి, కీర్తి, అమృత లక్ష్మీ, నైనార్ రమేష్ యాదవ్, ఆనంద్ బాబు యాదవ్, విజయ లను ఆయన ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. గెలుపొందున కార్పొరేటర్లు వారి డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వారందరూ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్