BREAKING
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా రాహుకాల పూజలు, ప్రదోషకాల అభిషేకాలు విధేయతకు పట్టం..... గురాన రాధికకు "డిప్యూటీ" పీఠం ? కారంచేడు, పర్చూరు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పరిశీలించిన APCPDCL సీఎజీఎం (ప్రాజెక్ట్స్) కె. లింగమూర్తి ఆకాశంలో పక్షుల విన్యాసం.. కలువాయిలో ప్రకృతి కనువిందు! దళితుల అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేయాలి ఏపీ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు జిల్లా అధ్యక్షుడిగా రాజా ఎన్నిక.. 100 మంది పేద మహిళలకు చీరల పంపిణీ ఎంపీపీ పీఠం ఎవరి పరం.. మళ్లీ లాటరీ తప్పదా? తిరుపతి మేయర్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియ చేసిన... పోనగంటి భాస్కర్ జగన్‌కు షాక్: నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు కల్పించారు - మాజీ మంత్రి జోగు రామన్న. ఈనెల 30ననవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు.. ఇటు పర్యటనలతో గట్టెక్కిస్తున్న సీఎం కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఆత్మకూరులో ఏకగ్రీవంగా ఎంపీటీసీ మెంబర్గా ఎన్నికైన "కేతా " ఆత్మకూరు జడ్పిటిసి బరిలో నలుగురు అభ్యర్థులు -ఇద్దరి మధ్య ప్రధాన పోటీ

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Select Suryaa Now
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు గుస్సాడి దండారి ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  అన్నారు. గిరిజనుల విశిష్టమైన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోనాల మండలం పార్డి బి గ్రామంలో నిర్వహించిన గుస్సాడి దండారి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, గుస్సాడి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలలో ఆదివాసీ సంస్కృతికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. గుస్సాడి దండారి వేడుకలు కేవలం పండుగ మాత్రమే కాకుండా గిరిజనుల ఐక్యత, సోదరభావం, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఒక గ్రామానికి చెందిన దండారి బృందాలు మరో గ్రామానికి వెళ్లి ఉత్సవాల్లో పాల్గొనడం గిరిజనుల మధ్య ఉన్న ఐక్యతకు నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు పరిచయం చేయాలని సూచించారు. గ్రామస్థులంతా ఐకమత్యంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, ఈ గ్రామం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పండుగలను సంప్రదాయబద్ధంగా, శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం, గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.