BREAKING
డాక్టర్ యస్ ఆర్ జె డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పును అడ్డుకోలేరు : మంత్రి ఆనం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు మహారాజా కళాశాలలో ఎంసీఐసీ కేంద్రం ప్రారంభం... శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా రాహుకాల పూజలు, ప్రదోషకాల అభిషేకాలు విధేయతకు పట్టం..... గురాన రాధికకు "డిప్యూటీ" పీఠం ? కారంచేడు, పర్చూరు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పరిశీలించిన APCPDCL సీఎజీఎం (ప్రాజెక్ట్స్) కె. లింగమూర్తి ఆకాశంలో పక్షుల విన్యాసం.. కలువాయిలో ప్రకృతి కనువిందు! దళితుల అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేయాలి ఏపీ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు జిల్లా అధ్యక్షుడిగా రాజా ఎన్నిక.. 100 మంది పేద మహిళలకు చీరల పంపిణీ ఎంపీపీ పీఠం ఎవరి పరం.. మళ్లీ లాటరీ తప్పదా? తిరుపతి మేయర్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియ చేసిన... పోనగంటి భాస్కర్ జగన్‌కు షాక్: నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు కల్పించారు - మాజీ మంత్రి జోగు రామన్న. ఈనెల 30ననవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్

రైతు మేళాను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

Select Suryaa Now
రైతు మేళాను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

దుద్యాల్, మేజర్ న్యూస్:కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి ఎడ్యుకేషన్ హబ్‌లో రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని, ఇందులో భాగంగా మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. రైతు మేళాకు వచ్చే రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు తాగునీరు, భోజన వసతి వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 7న ముఖ్యమంత్రి హకీంపేటలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారని, 7,500 మందికి పైగా రైతులు పాల్గొనే కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులతో ముఖాముఖి నిర్వహించి ఎల్‌నినో ప్రభావంపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వివరించారు. నవంబర్ 8న 7,500 మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగే సమావేశంలో పాల్గొనడంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. నవంబర్ 9న హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని, ఈ సభకు పది జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు మేళాలో వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమలు, పశుసంవర్ధక, మత్స్య తదితర అనుబంధ శాఖల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే పంటల సాగు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించి తగిన సూచనలు, సలహాలు అందించాలని అధికారులకు సూచించారు. రైతు మేళాకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జడ్పీ సీఈఓ సుధీర్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.