కోహెడ మండల అభివృద్ధికి బీజేపీ నాయకులు అడ్డుపడటం సరైనది కాదు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్
కోహెడ మండల కేంద్రంలో నిన్న జరిగిన 1227 సర్వే నంబర్ భూమి ఆక్రమణకు గురైన భూమిని రెవెన్యూ అధికారులు తొలగింపు చేస్తే అధికారులను, ప్రభుత్వాన్ని తప్పు బట్టిన బీజేపీ నాయకులపై తీవ్రంగా స్పందించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బీజేపీకి చెందిన 1వ వార్డు మెంబర్ కట్టా ప్రవీణ్‌ను ఈ విషయంలో వెనకుండి ప్రోత్సహిస్తుంది ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ ఇప్పటికే వారికి అధికారికంగా నోటీసులు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు పలుమార్లు వారికి నచ్చజెప్పి హెచ్చరించినప్పటికీ వారు పెడచెవిన పెట్టారని విమర్శించారు.
బీజేపీ నాయకులు మరియు వారు ఈ వ్యవహారంపై పలుమార్లు అధికారులకు 'ప్రజావాణి' కార్యక్రమంలో దరఖాస్తులు కూడా ఇచ్చారని, ఇప్పుడు ఏకంగా గ్రామాభివృద్ధి పనులను పనిగట్టుకుని అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, ఆ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు.
పొన్నాల భూపతికి సంబంధించిన ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీస్ విభాగాలు వెంటనే జోక్యం చేసుకుని, నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. మన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే ఇటువంటి రాజకీయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్, మాజీ సర్పంచ్ లు దొమ్మాట జగన్ రెడ్డి,గోరిత్యాల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ బోయిని జయరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దూలం శ్రీనివాస్ గౌడ్,వార్డు సభ్యులు చుక్క శంకర్, గజ్జెల ప్రవీణ్,నాయకులు చుక్క అశోక్, వేల్పుల వెంకటస్వామి,మంద వంశీ,తాటిపాముల ప్రవీణ్, గోవింద్ రమేష్,బైరీ శ్రీనివాస్, వేల్పుల మహేష్ బాబు, శంశీర్ మరియు తదితరులు పాల్గొన్నారు