రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ
సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో శుక్రవారం రెండో విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు శశికుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్, లబ్ధిదారులు ఆనంద్, నాయకులు శంకరప్ప, మధు, అనిల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.