BREAKING
టాలీవుడ్ నటి సంచలన అరెస్ట్.. డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిచి బెదిరించి దోపిడీ చేసిన అతుల్య చంద్ర! ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు! టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర. ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్! అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు! నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్ సిరిమాను సంబరాలలో శిరీష గానం అనంతపురం (వైఎస్సార్ సీపీ నాయకురాలు లీలావతి మృతి – అంజలి ఘటించిన మేయర్ రమేష్ గౌడ్ వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు

ఆత్మకూరు ఎంపీటీసీ బరిలో 21 మంది అభ్యర్థులు -భవితవ్యం తేలేది నేడే

Select Suryaa Now
ఆత్మకూరు ఎంపీటీసీ బరిలో 21 మంది అభ్యర్థులు -భవితవ్యం తేలేది నేడే

ఆత్మకూరు, మేజర్ న్యూస్:   ఆత్మకూరు మండలంలో 8 ఎంపీటీసీ స్థానాల్లో 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా చెర్లో ఏడవల్లి ఎంపిటిసి స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థి కేతా వేణుగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో 21 మంది అభ్యర్థులు పోటీల్లో ఉండగా గురువారం పోలింగ్ నిర్వహించారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. మండలంలోని వాసిలి ఎంపిటిసి స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా మామిడి చందన, వైసీపీ అభ్యర్థిగా సంకె ఆదిలక్ష్మి పోటీలో ఉన్నారు. పడకండ్ల ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా కొల్లి నరసయ్య నాయుడు, వైసీపీ అభ్యర్థిగా కొల్లి దొరస్వామినాయుడు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా దొడ్ల శ్రీనివాసులు నాయుడు పోటీలో ఉన్నారు. నువ్వురుపాడు ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా షేక్ ఖాజావలి, వైసీపీ అభ్యర్థిగా షేక్ ఖాదర్ బాషా పోటీలో ఉన్నారు. మహిమలూరు ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా సోమా ప్రశాంత లక్ష్మి, వైసీపీ అభ్యర్థిగా శ్యామనబోయిన సుజాత పోటీలో ఉన్నారు. మురుగుళ్ల ఎంపిటిసి స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పువ్వాడి వెంకటేశ్వర్లు, వైసీపీ అభ్యర్థిగా కోనేపల్లి సుబ్బారెడ్డి, ఇండిపెండెంట్ లుగా దొడ్ల మల్లికార్జున, పచ్చ వెంగయ్య,పచ్చ శరత్ కుమార్లు పోటీల్లో ఉన్నారు. బట్టేపాడు ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా వీరదిమ్మ గీతమ్మ, వైసీపీ అభ్యర్థిగా కట్ట లక్ష్మీదేవి పోటీలో ఉన్నారు. అప్పారావు పాలెం ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా బొమ్మ తాటి ఇందిరమ్మ, వైసీపీ అభ్యర్థిగా గంటా సునీత పోటీలో ఉన్నారు. కరటంపాడు ఎంపిటిసి స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా ధావా సుమన్య, వైసిపి అభ్యర్థిగా గుడిపాడు జహీరా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కుంట శ్రీలత పోటీలో ఉన్నారు. శనివారం ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం అభ్యర్థుల  భవితవ్యం తేలనుంది.