telangana
శ్రీరాంపూర్ ఎకో పార్కు పనులు త్వరగా పూర్తి చేయాలి - జీఎం మునిగంటి శ్రీనివాస్
సూర్య నస్పూర్ : శ్రీరాంపూర్ ఓసీపీ మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న ఎకో పార్కు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్కు నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించి పురోగతిని సమీక్షించారు. గత నెలతో పోలిస్తే పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోందని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. పార్కులో ఆకట్టుకునేలా వాటర్ ఫౌంటెన్లు, వాకింగ్ ట్రాక్, లైటింగ్, లేక్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పార్కును పిల్లలు, పెద్దలు సేదతీరేలా ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దాలని, ప్రారంభం అనంతరం శ్రీరాంపూర్ ఏరియాకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీ ఓసీపీ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, డీజీఎం (ఫారెస్ట్) హరినారాయణ, సివిల్ హెచ్‌ఓడీ రవికుమార్, ఓసీపీ మేనేజర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.