సూర్య దస్తురాబాద్ : రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని ఉద్యాన అధికారి సాదుల మౌనిక సూచించారు. శుక్రవారం రేవోజీపేట రైతు వేదికలో వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారి మౌనిక మాట్లాడుతూ రైతులు వరి, మొక్కజొన్న వంటి పంటలకే పరిమితం కాకుండా పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వీబీజీ - రామ్ జి పథకం ద్వారా నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బిందు, తుంపర సేద్యానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.వ్యవసాయ అధికారి మానస మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. పంటల దిగుబడి పెంచేందుకు పీఎస్‌బీ, అజటోబాక్టర్, రైజోబియం వంటి జీవ ఎరువులను వినియోగించుకోవాలని వివరించారు. ప్రీ యూనిక్ కంపెనీ ఏరియా మేనేజర్ గుజ్జరి దినేష్ ఆయిల్ పామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈవో కిరణ్, రేవోజీపేట సర్పంచ్ మహేష్, గోడిసెర్యాల సర్పంచ్ రాజేష్, రైతులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యాన అధికారి, సర్పంచ్ మహేష్ చేతుల మీదుగా రైతులకు చిరు కూరగాయల కిట్లను పంపిణీ చేశారు.