BREAKING
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు.. ఇటు పర్యటనలతో గట్టెక్కిస్తున్న సీఎం కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఆత్మకూరులో ఏకగ్రీవంగా ఎంపీటీసీ మెంబర్గా ఎన్నికైన "కేతా " ఆత్మకూరు జడ్పిటిసి బరిలో నలుగురు అభ్యర్థులు -ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన ప్రమాద బాధితుడికి అండగా మంత్రి జూపల్లి పౌరసరఫరాల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు ఆసియా పారా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ విభాగంలో పతకాలు విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి కడెం కెనాల్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ రాస్తారోకో ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమను సత్కరించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీ చైతన్య పాఠశాలలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం.. ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా 52 మంది రక్తదానం.. ప్రాణదాతలుగా నిలిచిన ఉద్యోగులు, శ్రేయోభిలాషులు భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది పంట మార్పిడి చేసుకోని పొదుపుగా నీటిని వినియోగించుకోవాలి ఆత్మకూరు ఎంపీటీసీ బరిలో 21 మంది అభ్యర్థులు -భవితవ్యం తేలేది నేడే

25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె

Select Suryaa Now
25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్ లో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 25వ రోజు కొనసాగింది. శుక్రవారం ఎన్హెచ్ఎం ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. తమ పరిస్థితి దౌర్భాగ్యకరంగా మారిందని, చివరి దశకు చేరుతుందని, అంపశయ్యపై ఎన్హెచ్ఎం ఉద్యోగుల భవిష్యత్తుగా మారిందని నిరసన వ్యక్తం చేశారు. కట్టెలతో పేర్చిన అంపశయ్య పై తమ డిమాండ్లను పడుకోబెట్టి ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ నిరసన తెలిపారు. చివరి క్షణంలో తులసి దళంతో నీళ్లను పోసైన తమ ప్రాణాలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. 25 రోజులుగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, కేవలం మాటలకే పరిమితం కావడం తమను తీవ్రంగా కలిచి వేస్తుందని, తమ ఉద్యోగుల పరిస్థితి దుర్లభంగా మారిందని ఆవేదన వెళ్లగక్కారు. తమవి గొంతమ్మ కోరికలు కాదని, కనీస వేతన స్కేలు ఇవ్వాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఆపదలో మరణిస్తే ఎక్స్ గ్రేషియా, ఇన్సూరెన్స్ తదితర వాటిని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఏమాత్రం సాత్సారం చేయకుండా తమ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వైద్య సిబ్బంది వెంకటరమణ, అశ్విని, డా.రాహుల్,డా.వేణుమాధవ్, డా.మారుతి, డా.హరీష్, శేఖర్, బాలు, రాజు,కవిత నిర్మల, స్వాతి, శ్రావణి, సుకన్య, సుప్రియ, శ్రీకాంత్ రోషిని తదితరులు పాల్గొన్నారు