telangana
కల్యాపూర్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం
సూర్య రెంజల్ : మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ రెమ్మ భానుచందర్ తెలిపారు. శుక్రవారం గ్రామంలో నిర్మాణం చేపడుతున్నటువంటి కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ఎంపీఓ గిరిజతో కలిసి పనులను పరిశీలించారు. ఎల్నీనో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొన ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశాల మేరకు గ్రామంలో సుమారు 7 కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. మండలంలోని మొదటి గ్రామంగా పనులు చేపట్టడం సంతోషకరమని ఎంపీ ఓ అన్నారు. అలాగే గ్రామంలో ప్రతి కుటుంబాలను సర్పంచ్ కలిసి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టుకోవాలని అవగాహన కల్పించడం జరిగిందని, అందులో సుమారు 40 కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. వీరి వెంట కార్యదర్శి నవీన్, క్షేత్ర సహాయకులు తదితరులు ఉన్నారు.