telangana
అనుమతులు లేని టపాకాయల దుకాణాలపై కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు
Telangana
06 Nov 2026
52 views
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కేంద్రంలో దీపావళి పండుగను పురస్కరించుకొని టపాకాయ దుకాణాలు పుట్టగొడుగుల్లాగా వెలుస్తు అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న దుకాణాలవైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల ప్రజలు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. టపాకాయ దుకాణాలను పట్టణంలో వీధుల్లో ఏర్పాటు చేయకుండా డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తామని తీసుకోవడానికి అవకాశం కల్పించగా సుమారు 28 టపాకాయ దుకాణాలు వెలిశాయి. అందులో కేవలం ఆరు దుకాణాలకు అనుమతులు లభించగా మిగతా దుకాణాలకు అనుమతులు లేకున్నా యదేచ్ఛగా కొనుగోలు చేపడుతున్నారు. లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న దుకాణం దారులు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కేవలం రెండు మూడు రోజుల ముందే దరఖాస్తు చేసుకోవడం తో అనుమతులకు ఆలస్యం కావడం వారికి అనుగుణంగా మారినట్లు ప్రచారం జరుగుతుంది. టపాకాయ దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి అగ్నిమాపక శాఖ, మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ,తహసిల్దార్, విద్యుత్ శాఖ జిఎస్టి, అధికారుల అనుమతుల అనంతరం ఆర్డీవోకు సమర్పిస్తే పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులకు మామూలు అప్పజెప్పి ఎన్ఓసీలు లేకుండా అనుమతులు లేకుండా టపాకాయలు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి లక్షల రూపాయల వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రభుత్వా ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల విమర్శలు వెలివెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు అక్రమంగా పటాకుల వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణాలపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. *ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి* ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తున్న టపాకాయల దుకాణ వ్యాపారస్తులు ప్రభుత్వా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటుకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ కాలేజ్ గ్రౌండ్ లో టపాకాయల దుకాణం ఏర్పాటు చేసినందుకు హోల్ సేల్ షాప్ కు25 వేల రూపాయలు రిటైల్ షాప్ కు 18,500 రూపాయలు చెల్లించి కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకునేందుకు ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. గత ఏడాది అనుమతి పొందిన 19 షాపులతోపాటు 9 షాపులు అదనంగా ఏర్పాటు చేసినట్లు, మొత్తం 28 షాపులు గ్రౌండ్లో ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
ట్యాగ్లు:
Latest News