సిలువ గుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం
• జేసీబీ, టిప్పర్లను అడ్డుకున్న సీపీఐ నాయకులు
• తవ్వకాలు నిలిపివేయకుంటే రేపు రాస్తారోకో, ధర్నాకు హెచ్చరిక
సూర్య, లక్షెట్టిపేట :
మొదలశివారులోని సిలువ గుట్టపై జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలను సీపీఐ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న సీపీఐ బృందం జేసీబీ, టిప్పర్లను అడ్డుకుని తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ భర్త సిలువ గుట్టపై నుంచి మట్టిని తవ్వి విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని సీపీఐ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై మైనింగ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే రేపు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.