BREAKING
ఈనెల 30ననవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు.. ఇటు పర్యటనలతో గట్టెక్కిస్తున్న సీఎం కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఆత్మకూరులో ఏకగ్రీవంగా ఎంపీటీసీ మెంబర్గా ఎన్నికైన "కేతా " ఆత్మకూరు జడ్పిటిసి బరిలో నలుగురు అభ్యర్థులు -ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన ప్రమాద బాధితుడికి అండగా మంత్రి జూపల్లి పౌరసరఫరాల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు ఆసియా పారా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ విభాగంలో పతకాలు విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి కడెం కెనాల్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ రాస్తారోకో ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమను సత్కరించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీ చైతన్య పాఠశాలలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం.. ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా 52 మంది రక్తదానం.. ప్రాణదాతలుగా నిలిచిన ఉద్యోగులు, శ్రేయోభిలాషులు భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది

గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి

Select Suryaa Now
గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి

సూర్య- బిక్కనూర్ : గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మండల ప్రత్యేక అధికారి, డి ఎల్ పి ఓ శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాలలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కల్పించాలని సూచించారు. గ్రామాలలో నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలని ఇందులో భాగంగా ఇంకుడు గుంతలను ప్రోత్సహించాలని వివరించారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులు తాము చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సవిత రెడ్డి, ఎంపీఓ రాజ్ కిరణ్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు