andhrapradesh
జూనియర్ లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి, సెంట్రల్ లైబ్రరీలో జూనియర్ లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో పీజీ (MLIS) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మొత్తం 4 ఖాళీలు అందుబాటులో ఉండగా, ఎంపికైన వారికి నెలకు రూ.25,000 వేతనం అందజేస్తారు. గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు కాగా, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు వర్తిస్తుంది.