BREAKING
కల్వకోల్ సల్లగరిగే చెరువుకు కేఎల్ఐ నీరు చేరేలా చర్యలు బ్రిక్స్ వారోత్సవాల కార్యక్రమం రైతు మేళాను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కోహెడ మండల అభివృద్ధికి బీజేపీ నాయకులు అడ్డుపడటం సరైనది కాదు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు హంగేరీ పర్యటనలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద జిల్లాలో నూనెగింజల ఉత్పత్తి అభివృద్ధికి సహకరించాలి కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు 2026లోనూ 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటే అవకాశం బియ్యం కేటాయింపు లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచిన కేంద్రం ​డా. కె. రాజారెడ్డి సేవలు చిరస్మరణీయం కోవిడ్ వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ మీథేన్ నిబంధనల అమలును ఏడాది పాటు వాయిదా వేసిన ఐరోపా సమాఖ్య హిమ్స్ అండ్ హెర్స్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా నేరుగా ఊబకాయం మందులను విక్రయించనున్న ఎలి లిల్లీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఓబీసీ క్రిమిలేయర్‌పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకంః ప్రభుత్వ విప్‌ వీహెచ్

Select Suryaa Now
 ఓబీసీ క్రిమిలేయర్‌పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకంః ప్రభుత్వ విప్‌ వీహెచ్

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఓబీసీ క్రిమిలేయర్ గుర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సుప్రీంకోర్టు ఎంతో మంచి నిర్ణయం తీసుకుందని, గత 20 ఏళ్లుగా తాను ఎదురుచూస్తున్న అంశంపై వెలువడిన ఈ తీర్పు పట్ల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తల్లిదండ్రుల జీతం లేదా ఆదాయాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ఒక అభ్యర్థిని ఓబీసీ క్రిమిలేయర్ పరిధిలోకి చేర్చడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం సామాజిక న్యాయం దిశగా కీలక ముందడుగు అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును అమలు చేయడానికి రెండేళ్ల సమయం కావాలని, భవిష్యత్తులో జారీ చేసే నోటిఫికేషన్ల నుంచే తీర్పును వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ, సుప్రీంకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించిందని తెలిపారు. ఓబీసీల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణకు ఈ తీర్పు ఎంతో దోహదపడుతుందని వీహెచ్ పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న న్యాయం దక్కినందుకు సుప్రీంకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.