telangana
పోలీస్ స్టేషన్ వద్ద కత్తితో దాడి.. కేసు నమోదు
సూర్య, మాక్లూర్ : మాక్లూర్ మండలం మాణిక్ భండార్ గ్రామానికి చెందిన నీరాడి గంగాధర్, కటిక శంకర్ మధ్య స్థల వివాదంతో పాటు డబ్బుల విషయంలో గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గంగాధర్ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా, శంకర్ అతడిని వెంబడించి పోలీస్ స్టేషన్ వద్ద కారు దిగుతున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ ఆవరణలో కలకలం రేగింది.ఈ ఘటనపై గంగాధర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మాక్లూర్ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.