BREAKING
టాలీవుడ్ నటి సంచలన అరెస్ట్.. డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిచి బెదిరించి దోపిడీ చేసిన అతుల్య చంద్ర! ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు! టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర. ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్! అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు! నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్ సిరిమాను సంబరాలలో శిరీష గానం అనంతపురం (వైఎస్సార్ సీపీ నాయకురాలు లీలావతి మృతి – అంజలి ఘటించిన మేయర్ రమేష్ గౌడ్ వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు

రిగ్గింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలి

Select Suryaa Now
రిగ్గింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలి

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   మర్రిపాడు మండలం తిక్కవరం పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు, దీనిపై సమగ్ర విచారణ జరిపించి, రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ మర్రిపాడు జడ్పీటీసీ అభ్యర్థి సిద్దంరెడ్డి వెంకటరమణమ్మ, తదితర నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను మర్రిపాడు ఎస్సై బలరాం రెడ్డి అకారణంగా బలవంతంగా బయటకు పంపించారని, ఏజెంట్లు లేకుండా చేసి టీడీపీ నాయకులు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు.  విషయం తెలుసుకున్న జడ్పీటీసీ ఎన్నికల ఏజెంట్ మరియు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అక్రమాలను అడ్డుకునేందుకు పోలింగ్ కేంద్రానికి బయలుదేరగా, మర్రిపాడు వద్ద ఆత్మకూరు సీఐ గంగాధర్ ఆయనను అడ్డుకుని సుమారు 30 నిమిషాలపాటు నిలువరించారని, ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకునే సమయానికి సుమారు 200 ఓట్లు రిగ్గింగ్ ద్వారా వేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.  పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించడం, అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిని నిలువరించడం వంటి పరిణామాలు ఎన్నికల పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని,  తిక్కవరం పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల దృశ్యాలు, పోలింగ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు.  ఎస్సై బలరాం రెడ్డి, సీఐ గంగాధర్ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రిగ్గింగ్ ఆరోపణలు నిర్ధారణ అయితే తిక్కవరం పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీఐ గంగాధర్ మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న ఘటనకు సంబంధించిన వీడియోతో పాటు, పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అనంతరం చోటుచేసుకున్న పరిణామాల వీడియో ఆధారాలను కూడా కలెక్టర్‌కు అందజేశారు.  వినతిపత్రం అందచేసిన వారిలో ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సిద్దంరెడ్డి మోహన్ రెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, రవి తదితరులు ఉన్నారు.