BREAKING
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా రాహుకాల పూజలు, ప్రదోషకాల అభిషేకాలు విధేయతకు పట్టం..... గురాన రాధికకు "డిప్యూటీ" పీఠం ? కారంచేడు, పర్చూరు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పరిశీలించిన APCPDCL సీఎజీఎం (ప్రాజెక్ట్స్) కె. లింగమూర్తి ఆకాశంలో పక్షుల విన్యాసం.. కలువాయిలో ప్రకృతి కనువిందు! దళితుల అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేయాలి ఏపీ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు జిల్లా అధ్యక్షుడిగా రాజా ఎన్నిక.. 100 మంది పేద మహిళలకు చీరల పంపిణీ ఎంపీపీ పీఠం ఎవరి పరం.. మళ్లీ లాటరీ తప్పదా? తిరుపతి మేయర్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియ చేసిన... పోనగంటి భాస్కర్ జగన్‌కు షాక్: నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు కల్పించారు - మాజీ మంత్రి జోగు రామన్న. ఈనెల 30ననవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు.. ఇటు పర్యటనలతో గట్టెక్కిస్తున్న సీఎం కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఆత్మకూరులో ఏకగ్రీవంగా ఎంపీటీసీ మెంబర్గా ఎన్నికైన "కేతా " ఆత్మకూరు జడ్పిటిసి బరిలో నలుగురు అభ్యర్థులు -ఇద్దరి మధ్య ప్రధాన పోటీ

బీసీలకు భవనాలతోపాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలిః బీసీ నాయకుల ముక్తకంఠం డిమాండ్

Select Suryaa Now
    బీసీలకు భవనాలతోపాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలిః  బీసీ నాయకుల ముక్తకంఠం డిమాండ్

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.88.50 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీసుకున్న చొరవ బీసీల ఆత్మగౌరవానికి గుర్తింపుగా నిలుస్తుందన్నారు. అయితే భవనాల నిర్మాణంతోపాటు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. శుక్రవారం అబిడ్స్‌లోని మీడియా పాయింట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ కుల సంఘాల భవనాల నిర్మాణానికి స్థలాలు, నిధులు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాటి అమలుపై స్పష్టత లేదన్నారు. గతంలో 41 భవనాలకు 87 ఎకరాల 30 గుంటల స్థలం, రూ.95.25 కోట్లు మంజూరైనట్లు వెల్లడైన నేపథ్యంలో వాటిలో ఎన్ని భవనాలు పూర్తయ్యాయి? ఎంతమేర నిధులు ఖర్చయ్యాయి? ఎన్ని అసంపూర్తిగా మిగిలాయి? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తెలంగాణ కులగణనలో బీసీల జనాభా 56.33 శాతంగా నమోదైనందున జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని, జనగణన-2027లో ప్రత్యేక ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేసి ప్రతి కులానికి ప్రత్యేక జాతీయ కుల కోడ్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. బీసీ సబ్‌ప్లాన్, బీసీ రక్షణ చట్టం తీసుకురావడంతోపాటు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ భవనాలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా గ్రంథాలయాలు, పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, డిజిటల్ విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. బీసీ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు.

గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి

బీసీల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్న గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులందరూ ముక్తకంఠంతో కోరారు. బీసీ ఉద్యమంలో ఆయన చేసిన కృషి, సామాజిక సేవ, వివిధ వర్గాలను సమన్వయం చేస్తూ హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రాజకీయ వారసత్వం కంటే ప్రజా ఉద్యమాలు, సామాజిక సేవకు ప్రాధాన్యం ఇవ్వాలని, గుజ్జ సత్యం అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ఒక్క వ్యక్తికి ఇచ్చే గుర్తింపు మాత్రమే కాదని, బీసీ ఉద్యమానికి ఇచ్చే గౌరవమని అభిప్రాయపడ్డారు. గుజ్జ సత్యం మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పిస్తే శాసనమండలిలో బీసీల సమస్యలు, హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం మరింత బలంగా పోరాడతానన్నారు. ఈ సమావేశంలో బీసీ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు భీమ్‌రాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు మేకల పరుశురాం, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కుమార్, విజయ్‌కుమార్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ రామదేవ్ యాదవ్, బీసీ నాయకులు వెంకటరామయ్య, నరేంద్ర, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రాములుగౌడ్ పాల్గొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.