BREAKING
కల్వకోల్ సల్లగరిగే చెరువుకు కేఎల్ఐ నీరు చేరేలా చర్యలు బ్రిక్స్ వారోత్సవాల కార్యక్రమం రైతు మేళాను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కోహెడ మండల అభివృద్ధికి బీజేపీ నాయకులు అడ్డుపడటం సరైనది కాదు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు హంగేరీ పర్యటనలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద జిల్లాలో నూనెగింజల ఉత్పత్తి అభివృద్ధికి సహకరించాలి కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు 2026లోనూ 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటే అవకాశం బియ్యం కేటాయింపు లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచిన కేంద్రం ​డా. కె. రాజారెడ్డి సేవలు చిరస్మరణీయం కోవిడ్ వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ మీథేన్ నిబంధనల అమలును ఏడాది పాటు వాయిదా వేసిన ఐరోపా సమాఖ్య హిమ్స్ అండ్ హెర్స్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా నేరుగా ఊబకాయం మందులను విక్రయించనున్న ఎలి లిల్లీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

హోమం నిర్వహించిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు -- ధర్నా శిబిరంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు -- 25వ రోజుకు చేరుకున్న నిరవధిక సమ్మె.. -- డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

Select Suryaa Now
హోమం నిర్వహించిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు -- ధర్నా శిబిరంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు -- 25వ రోజుకు చేరుకున్న నిరవధిక సమ్మె..  -- డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

నారాయణపేట, నవంబర్ 6 (సూర్యన్యూస్): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ధన త్రయోదశి సందర్భంగా హోమం*
ఈ నేపథ్యంలో శుక్రవారం ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ధర్నా శిబిరం వద్ద ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ప్రత్యేకంగా ధన్వంతరి హోమాన్ని నిర్వహించారు. ఆరోగ్యానికి అధిదేవతగా భావించే శ్రీ ధన్వంతరి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో హోమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా ఒకచోట చేరి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, సమాజంలో అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య సంపద వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తమ న్యాయమైన డిమాండ్లు త్వరగా పరిష్కారమై, ఉద్యోగుల కుటుంబాల్లో సైతం సంతోషం, భరోసా, వెలుగులు నిండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

*ప్రజారోగ్య సేవల్లో కీలకపాత్ర.. అయినా ఉద్యోగ భద్రత కరువు*
జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆరోగ్య సేవలు అందించడం, వ్యాధుల నియంత్రణ, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడం వంటి అనేక బాధ్యతలను తాము నిర్వర్తిస్తున్నామని తెలిపారు. ఎండ, వాన, రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో అంతర్భాగంగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి తగిన వేతనాలు అందించాలని, ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

*పండుగ పూట.. కుటుంబానికి దూరం*
పండుగ రోజున కూడా తమ కుటుంబాలకు దూరంగా ధర్నా శిబిరంలో గడుపుతూ హోమం నిర్వహించాల్సిన పరిస్థితి రావడం తమ సమస్యల తీవ్రతను తెలియజేస్తోందని ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలకు ఆహ్వానించి, తమ డిమాండ్ల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకట రమణ, కోశాధికారి రాఘవేందర్, సభ్యులు వినోద్, కిరీటి, తిరుపతి, మోనేష్ చారి, విరోజా, రేణుక, సౌందర్య, గాయత్రి, నవీన, మల్లికార్జున్, సుమన, రామేశ్వరి, ఆశాజ్యోతి, సావిత్రమ్మ, రామలింగమ్మ, నాగజ్యోతి, సుమిత్ర, అలివేలు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.