శ్రీకాళహస్తిలో టెన్షన్, సైకిల్ ఫ్యాన్ కమలం గాజు గ్లాసు పలితాలు
శ్రీకాళహస్తి, మేజర్ న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఫలితాలు శనివారం రానున్నాయి. ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ సైకిల్, వైయస్సార్ పార్టీ ఫ్యాన్, బిజెపి కమలం, జనసేన పార్టీ గాజు గ్లాస్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. పది రోజులుగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేణిగుంట మండలంలో జడ్పిటిసి అభ్యర్థులు వైసిపి బిజెపి పోటీ పడుతున్నాయి. తొట్టంబేడు మండలంలో ఫ్యాన్, సైకిల్ పడుతున్నాయి. ఎంపీటీసీలు విషయానికొస్తే కుటమి పార్టీలు జనసేన, బిజెపి పోటీ పడుతున్నాయి. తెలుగుదేశం, వైయస్సార్ పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు నాయకులు ఓటర్లకు అనేక పరలోభాలకు గురిచేయడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో శనివారం ఫలితాలలో తెలుస్తున్నది. సైకిల్ స్పీడు పెంచుతుందో, ఫ్యాన్ గాలి విపరీతంగా విస్తుందో, కమలం విరబూస్తుందో, గాజు గ్లాస్ మోగుతుందో శనివారం ఫలితాల్లో తెలుస్తుంది,