BREAKING
వార్షిక లాభాల అంచనాలను పెంచిన ఆరోగ్య బీమా దిగ్గజం 'హుమానా' ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో భారీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ వైష్ణవి మృతి ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి టెలిహెల్త్ దిగ్గజం 'రో' సరికొత్త పరిశోధన విభాగం అమెరికా మధ్యంతర ఎన్నికల వేడి, ఏఐ వ్యయ భారం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ త్రైమాసిక నికర లాభం స్థిరంగా నమోదు సమస్యలను గుర్తించి.. పరిష్కార మార్గాలను అన్వేషించిన విద్యార్థులు -- విజయవంతంగా జిల్లా స్థాయి బాలల సైన్స్ సదస్సు -- రాష్ట్రస్థాయి అర్హత సాధించిన మూడు ప్రాజెక్టులు క్వాల్‌కామ్‌లో 548 మిలియన్ డాలర్ల వాటాను ప్రకటించిన అల్ఫాబెట్ వైన్ ఉత్పత్తి అంచనాలను పెంచిన ఫ్రాన్స్ బోనస్‌ వచ్చింది.. పింఛన్‌ ఏది? - దీపావళి పండుగ వస్తున్నా అందని పింఛన్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాష్టీకం. చైనీస్ అసెంబ్లీ అసమ్మతివాదుల నిఘాపై ఇటలీ సంచలన దర్యాప్తు పేద విద్యార్థుల పై దయలేదా..? ఆర్‌.కృష్ణయ్య బడ్జెట్ చర్చలను పునరుద్ధరించనున్న బెల్జియం ప్రభుత్వం

కూటమి పాలన మెచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు నేటి ఫలితాలు.

Select Suryaa Now
కూటమి పాలన మెచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు నేటి ఫలితాలు.

నెల్లూరు,  మేజర్ న్యూస్ :     నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పిల్ రావు, మనుబోలు శ్రీధర్ రెడ్డి, మాతంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ.... స్థానిక సంస్థల ఎన్నికల నుండి ఎలాగైనా తప్పించుకోవాలని జగన్ స్థాయి నుండి వైసీపీ కార్యకర్త స్థాయి వరకు కోరుకున్నారు. మోసపూరితంగా రిజర్వేషన్ వివాదంను వైసీపీ నేతలు సృష్టించారు, న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు. సర్ ఓటర్ లిస్టు ద్వారా లక్షలాదిమంది వైసీపీ అభిమానుల ఓట్లు తొలగిస్తున్నారని తమకు పాత ఓటర్ లిస్టుతోనే ఎన్నికలు జరపాలని ఆందోళనలు చేశారు. ఎన్నికలను ఏ ఓటర్ లిస్టు ప్రకారం నిర్వహించాలో నిర్ణయించేది ఎన్నికల సంఘమే తప్ప కూటమి పార్టీలు కాదన్న సంగతి వైస్సార్సీపీ నేతలకు తెలియకపోవడం విచారకరం. కొత్త ఓటర్ లిస్టు(సర్) వచ్చేందుకు ఆలస్యం కానుండడం, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా మున్సిపాలిటీ - పంచాయతీ, మండల - జడ్పీలు కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాదంను ప్రభుత్వం గుర్తించింది. ఏ ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలను జరుపగలరో నిర్ణయం తీసుకోవాలని ఏ లిస్టు ప్రకారమైనా తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘానికి కూటమి ప్రభుత్వం తెలియజేసింది. స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ఎన్నికల వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు. 2021 స్థానిక సంస్థల ఎన్నికలను తాను ఎలా నిర్వహించారో జగన్ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను కమ్మవాడని జగన్ అవమానించారు. అధికారులను కులాలతో ముడిపెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల మీద వైసీపీ నేతలు సుప్రీంకి వెళ్లారు....ఎన్నిసార్లు డేటు మార్చినా ప్రజా అభిప్రాయాన్ని మార్చలేకపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని చూసి ఈవీఎమ్ లతో గెలిచామన్నారు, నేడు బ్యాలెట్ పేపర్లతో కూడా 2024కు మించి ఘన విజయం సాధించాం. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్లు వేయనివ్వలేదు. టీడీపీ గెలిచిన స్థానాలను ప్రకటించనివ్వలేదు. నేటి స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నేతలు దూరంగా పారిపోయారు. కొందరు తప్పులు తడకలుగా నామినేషన్లు వేసి ఎన్నికల నుంచి తప్పించుకోవడంతో పాటు కూటమి పార్టీల నేతలపై బురద చల్లుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కోసం ప్రతి రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నారా చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి పాలనను కోరుకుంటున్నారు, కూటమి పాలనతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి  ఓటు రూపంలో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు, వైసీపీ నేతలు ఇప్పటికైనా నాటకాలు కట్టి పెట్టండి.