చట్టాలపై సరైన అవగాహన పెంచుకోవాలి -జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రెటరీ న్యాయమూర్తి నిహారిక
చట్టాలపై సరైన అవగాహన పెంచుకున్నప్పుడే న్యాయం పొందవచ్చు అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రెటరీ న్యాయమూర్తి నిహారిక అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం వల్ల సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టవచ్చు అన్నారు. తద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించవచ్చు అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అందిస్తున్న ఉచ్చిత న్యాయ సేవల గురించి వివరించారు. ఎవరైనా న్యాయ వాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి సంస్థ తరుపున ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని అన్నారు. ఎవరికైనా ఉచిత న్యాయ సలహాలు కావాలంటే 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని అన్నారు.
-పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: