దత్తత మాతృత్వానికి వరం . చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం . ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :
సంతానం లేని దంపతులకు దత్తత ఒక వరం లాంటిదని ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, శిశు గృహ సోషల్ వర్కర్ శ్రీలక్ష్మి సూచించారు. ఐ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ షాజిదా బేగం ఆదేశాల మేరకు జాతీయ దత్తత అవగాహన మాసోత్సవం- 2026 పురస్కరించుకొని నగరంలో ఐసిడిఎస్ రాణినగర్ అంగన్వాడి కేంద్రంలో అవగాహన సమావేశం నిర్వహించారు. సంతానం లేని దంపతులు కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) నిబంధనలకు లోబడి పిల్లలను దత్తత కు తీసుకోవచ్చునని వివరించారు. చట్టబద్ధంగా దత్తత తీసుకోవడం శ్రేయస్కరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను తీసుకోవడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆసక్తి ఉన్న దంపతులు ఐసిడిఎస్ ఆధ్వర్యంలోని శిశు గృహాలో సంప్రదించాలని కోరారు. అలాగే వివిధ కారణాలతో శిశువులను ముళ్లపొదల్లో, చెత్తకుప్పల పక్కన వదిలేయడం నేరమని హెచ్చరించారు. అలాంటి సందర్భంలో ఐసిడిఎస్ అధికారులకు శిశువులను అప్పగించాలని సూచించారు. సదరు బాధితులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లీలావతి, అంగన్వాడీ వర్కర్లు లక్ష్మీనరసమ్మ, సత్యవతి, ఆశ వర్కర్ పద్మావతి, రాణి నగర్ కు చెందిన గర్భవతులు , బాలింతలు పాల్గొన్నారు.