BREAKING
కల్వకోల్ సల్లగరిగే చెరువుకు కేఎల్ఐ నీరు చేరేలా చర్యలు బ్రిక్స్ వారోత్సవాల కార్యక్రమం రైతు మేళాను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కోహెడ మండల అభివృద్ధికి బీజేపీ నాయకులు అడ్డుపడటం సరైనది కాదు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు హంగేరీ పర్యటనలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద జిల్లాలో నూనెగింజల ఉత్పత్తి అభివృద్ధికి సహకరించాలి కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు 2026లోనూ 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటే అవకాశం బియ్యం కేటాయింపు లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచిన కేంద్రం ​డా. కె. రాజారెడ్డి సేవలు చిరస్మరణీయం కోవిడ్ వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ మీథేన్ నిబంధనల అమలును ఏడాది పాటు వాయిదా వేసిన ఐరోపా సమాఖ్య హిమ్స్ అండ్ హెర్స్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా నేరుగా ఊబకాయం మందులను విక్రయించనున్న ఎలి లిల్లీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి -- జనవరి మొదటి వారంలోగా సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధుల వినియోగం గరిష్ట స్థాయికి చేరాలి

Select Suryaa Now
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి -- జనవరి మొదటి వారంలోగా సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధుల వినియోగం గరిష్ట స్థాయికి చేరాలి

నారాయణపేట, నవంబర్ 6 సూర్య న్యూస్:
ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా సాధించేలా జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు సూచించారు. విద్య, ఉపాధి హామీ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాల అమలులో జిల్లాల పనితీరును మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద కేటాయించిన నిధులను జనవరి మొదటి వారంలోగా గరిష్టంగా 100 శాతం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు. పాఠశాలలను అధికారులు తరచూ సందర్శించి సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలను నాణ్యతతో అమలు చేయాలని తెలిపారు. వేసవి కాలం ముగిసే వరకు ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. చేతిపంపులు, బోర్ పంపులు, బహిరంగ బావులు తదితర తాగునీటి వనరులకు నవంబర్ 15లోగా మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పైపులైన్లలో లీకేజీలు, నీటి వృథాను అరికట్టడంతో పాటు తాగునీటి సరఫరాపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. వీబీ జీ రామ్ జీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యాన్ని సాధించాలని, చేపట్టే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించి, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేయాలని సూచించారు. అలాగే లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను రూ.230కే అందించేలా చర్యలు తీసుకోవాలని, రాయితీల ప్రయోజనాలు అర్హులైన వారందరికీ చేరేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, చేయూత పింఛన్ల వెరిఫికేషన్‌ను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్ గౌడ్, ఆర్డీఓ రమేశ్, డీఆర్డీవో వెంకట్ రాములు, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.