national
పంజాబ్‌లో రైలు ప్రమాదం: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, ప్రయాణికులు సురక్షితం
పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ రైలు ప్రమాదం సంభవించింది. అమృతసర్ నుంచి న్యూ జల్ పాయిగురి వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12508) సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే బోగీల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వేగంగా విస్తరించిన ఈ మంటల ధాటికి రైలులోని బోగీలు దగ్ధమయ్యాయి.
మంటలు వ్యాపించడాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో పాటు, అప్రమత్తమైన ప్రయాణికులు దిగువకు దిగిపోవడంతో తృప్తిలో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బలగాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రాణనష్టం ఏమీ సంభవించలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తుండగా, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.