పీయూలో అంతర్ కళాశాల క్రీడా పోటీలు
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ :-
పీయు లో అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
మహబూబ్‌నగర్ పీయూ సూర్య న్యూస్ -పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఈ నెల 7న మహిళల కబడ్డీ, పురుషుల చెస్, 9న పురుషుల హాకీ, తైక్వాండో విభాగాల్లో అంతర్ కళాశాలల పోటీలు, జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ వై. శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. క్రీడాకారులు 25 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఎలిజిబిలిటీ ఫారంతో హాజరుకావాలని సూచించారు.ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 2 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే సౌత్ జోన్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాలమూరు యూనివర్సిటీ తరఫున పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
ఎం.ఓం ప్రకాష్.పాలమూరు యూనివర్సిటీ .మహబూబ్ నగర్.