BREAKING
ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించేది లేదు!జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు ఓబీసీ క్రిమిలేయర్‌పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకంః ప్రభుత్వ విప్‌ వీహెచ్ జూనియర్ లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు మూడేళ్లలో తొలిసారిగా సుదీర్ఘ లాభాల రికార్డు విశాఖపట్నంలో ముగిసిన భారత్-అమెరికా త్రివిధ దళాల 'టైగర్ ట్రయంఫ్-2026' విన్యాసాలు హోమం నిర్వహించిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు -- ధర్నా శిబిరంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు -- 25వ రోజుకు చేరుకున్న నిరవధిక సమ్మె.. -- డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ధనత్రయోదశి వ్యాపారం అమెరికా రాజకీయాల్లో ముస్లిం నేతల విజయం: ప్రజాకేంద్రీకృత రాజకీయాలకు నిదర్శనం వాతావరణ ముప్పు ఉచ్చులో 90 మిలియన్ల మంది నిరాశ్రయులు *అయిజ మండలంలో ముమ్మరంగా 'క్షేత్ బచావో అభియాన్'* రేవంత్ రెడ్డి పర్యటనతో హరీష్ రావు రాజకీయాలకు చెక్‌! టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ప్రత్యేక వైద్యం కోసం గుజరాత్‌కు తరలివెళ్లిన 18 నెలల ఏనుగు దూడ పోలింగ్ తరహాలోనే కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి - పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తవాంగ్ మఠంలో పవిత్ర బుద్ధ అవశేషాల దర్శనానికి పోటెత్తిన భక్తులు చట్టాలపై సరైన అవగాహన పెంచుకోవాలి -జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రెటరీ న్యాయమూర్తి నిహారిక

అనంతపురంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు: పాతూరు బ్రాహ్మణ వీధిలో 73వ ఉచిత శ్రీరామ కళ్యాణం

Select Suryaa Now
అనంతపురంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు: పాతూరు బ్రాహ్మణ వీధిలో 73వ ఉచిత శ్రీరామ కళ్యాణం

​అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్: ​గత ఏడు దశాబ్దాలకు పైగా ఎంతో నిష్టతో, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ ఉచిత కళ్యాణ మహోత్సవానికి పాతూరు వీధులన్నీ రామానామ స్మరణతో మారుమోగాయి. ఉదయాన్నే మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపించారు.

​ఈ వేడుకలో అనంతపురం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు విరివిగా పాల్గొన్నారు. భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తారకమంత్రం జపిస్తూ పునీతులయ్యారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు తీర్థప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు ఈ మహత్కార్యంలో పాలుపంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.