BREAKING
దత్తత మాతృత్వానికి వరం . చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం . ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అనంతపురంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు: పాతూరు బ్రాహ్మణ వీధిలో 73వ ఉచిత శ్రీరామ కళ్యాణం కళ్యాణదుర్గం లో మూడు కేంద్రాల్లో ఓట్ల లేకుంపు. మిల్లర్ల సిండికేట్‌తో రైతులకు కష్టాలు! విద్యార్థి సంఘం నాయకులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల పీహెచ్‌సీలో తనిఖీలు బీహార్‌లో ఎన్‌కౌంటర్: దానాపూర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత బీఎంసీ ఉద్యోగులకు కొత్త ఇళ్ల తాళాలు అందజేత తమిళ జాలర్ల మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇంటిగ్రేటెడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు 15 నుండి18 వరకు నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు ఎన్నికల సరళి పై తలారి రంగయ్య విశ్లేషణ.

15 నుండి18 వరకు నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు

Select Suryaa Now
15 నుండి18 వరకు నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు

లింగాల, మేజర్ న్యూస్ :: కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్నీ దివాలా తీసే విధంగా కేంద్రంలో చట్టాలు తీసుకురావడం, రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను పునరుద్ధరించాలని ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేనిచో రైతాంగం తిరుగుబాటు చేయక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యా నాయక్ హెచ్చరించారు. లింగాల మండలంలోని రాయవరం గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాల్లో జరిగే 36వ రైతు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సన్నాహక సమావేశం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యా నాయక్ మాట్లాడుతూ  వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డ నల్లగొండ జిల్లాల్లో అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలు ఈనెల 15 నుండి 18వ తేదీ వరకు జరుగుతున్నాయనీ తెలిపారు. ఈ మహాసభలకు రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. 15వ తేదీన భారీ బహిరంగ సభ లక్షలాదిమందితో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఎలెన్నో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు వచ్చి రైతులు వేసుకునే పంట చేతికి రాకుండా ఎందుకో పోయి తీవ్ర నష్టాల్లో ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని మన జిల్లాల్లో కూడా 20 మండలాలకు గాను 13 మండలాలు కరువు జిల్లాలుగా ప్రకటించారు మిగతా మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రకటించిన కరువు మండలాల్లో వాణిజ్య పంటలకు ఎగరకు 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆహార పంటలకు 25వేల చొప్పున ఎకరాకు పరిహారం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించిన వాటికి కేంద్ర ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
భారతదేశంలో రైతాంగం దివాలా తీసే స్థితిలో పాలకులు నెట్టివేయబడుతున్నారని వాటిని కాపాడేటందుకు రైతాంగాన్ని గట్టి ఎక్కించేటందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టకపోతే రైతాంగం సంక్షోభం ఏర్పడి ఆహార ధాన్యాలు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వారు అన్నారు. 
అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడానికి రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు. సిసిఐ ఐకెపి, పిఎసిఎస్ దాన్యం కొనుగోలు కేంద్రాలలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని రైతులు పండించే పండ్లు కూరగాయలు పత్తి మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధర లభించే విధంగా రైతాంగాన్ని చైతన్యం చేసి పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు, వ్యవసాయానికి సబ్సిడీలను పెంచాలని రైతులను రుణ విముక్తులను చేయాలని తెలంగాణ రైతు సంఘం కోరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శంకర్ నాయక్, రైతు సంఘం నాయకులు స్వామి దేవుడు శ్రీను భాగ్యమ్మ లక్ష్మమ్మ రైతులు తదితరులు ఉన్నారు.