BREAKING
మిల్లర్ల సిండికేట్‌తో రైతులకు కష్టాలు! విద్యార్థి సంఘం నాయకులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల పీహెచ్‌సీలో తనిఖీలు బీహార్‌లో ఎన్‌కౌంటర్: దానాపూర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత బీఎంసీ ఉద్యోగులకు కొత్త ఇళ్ల తాళాలు అందజేత తమిళ జాలర్ల మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇంటిగ్రేటెడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు 15 నుండి18 వరకు నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు ఎన్నికల సరళి పై తలారి రంగయ్య విశ్లేషణ. ముగిసిన నిషేధ కాలం: ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు క్రిస్ లిన్ రీఎంట్రీ! ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన కివీస్ స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వే: న్యూజిలాండ్‌కు భారీ షాక్!

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని కోటంరెడ్డి సంచలన నిర్ణయం!

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని కోటంరెడ్డి సంచలన నిర్ణయం!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   ప్రతినిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ వార్తల్లో నిలిచే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమీపిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గ్రామాల్లో ప్రజాదరణ ఉన్నవారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, ప్రజల మద్దతుతో ఎవరు గెలిచి వచ్చినా వారిని తనవారిగానే భావించి స్వాగతిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.  గ్రామాల్లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకులు నేరుగా నామినేషన్లు వేసి ప్రజల మద్దతుతో విజయం సాధించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా గ్రామాభివృద్ధి కోసం వారితో కలిసి పనిచేయడమే తన లక్ష్యమని ఆయన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశంగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ జోక్యం కారణంగా వ్యక్తిగత విభేదాలు, వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుని స్థానిక ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామాలు సున్నితమైన సామాజిక వ్యవస్థలని, రాజకీయాలకు అతీతంగా ప్రజల ఐక్యత, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా వారి తీర్పును గౌరవించి, గ్రామాల అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయం ఇస్తోంది.