BREAKING
ఆదర్శప్రాయుడు "మౌలానా అజాద్ " ఘనంగా బాలల దినోత్సవ వార్షిక కార్నివాల్ వీక్ 2026 ప్రారంభం ఈఆన్ తొమ్మిది నెలల ఆర్థిక లక్ష్యాలు పూర్తి.. విద్యుత్ గ్రిడ్ నెట్‌వర్క్‌లో భారీ పెట్టుబడులు! డేటా సెంటర్లు, గ్రిడ్ డిమాండ్‌తో సీమెన్స్ ఎనర్జీ లాభాలు ఫుల్.. 2027 నాటికి బంపర్ ఆఫర్! శివాజీ విగ్రహ ఆవిష్కరణ జ్ఞాపిక అందుచేత రేపు సీఐఐ సమ్మిట్‌లో పాల్గొననున్న అమిత్ షా, చంద్రబాబు, పవన్ తైవాన్ ప్రభుత్వ ఆఫీసుల్లో అగ్రరాజ్యం ఉద్యోగులు.. వాషింగ్టన్, తైపీల సంచలన ఒప్పందం! విజయసాయిరెడ్డి 'పరివర్తన రాజనీతి పార్టీ' ఆవిర్భావం యూరప్ మార్కెట్లలో సానుకూల ధోరణి.. ఏఐ టెక్నాలజీ షేర్లకు భారీ డిమాండ్! వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీసుల భారీ మోహరింపు ఇమ్రాన్ ఖాన్ కు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స.. మళ్లీ అడియాలా జైలుకు తరలింపు! విజ్ఞాన మేధావి ఆజాద్ ‎భారత దేశ ప్రప్రథమ విద్యాశాఖా మంత్రి ‎"మౌలానా అబుల్ కలామ్ ఆజాద్" ‎జన్మదినోత్సవం ఆర్మూర్ "బల్దియా"లో అక్రమ నిర్మాణాల జోరు...అదుపుచేయ"లేక"పోతున్న అధికారులు. 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఆగని అక్రమ నిర్మాణాలు.నోటీసులకే పరిమితమైన పంచాయతీ.

విజ్ఞాన మేధావి ఆజాద్ ‎భారత దేశ ప్రప్రథమ విద్యాశాఖా మంత్రి ‎"మౌలానా అబుల్ కలామ్ ఆజాద్" ‎జన్మదినోత్సవం

Select Suryaa Now
విజ్ఞాన మేధావి ఆజాద్ ‎భారత దేశ ప్రప్రథమ విద్యాశాఖా మంత్రి ‎"మౌలానా అబుల్ కలామ్ ఆజాద్" ‎జన్మదినోత్సవం

‎నేడు నవంబర్ -11 వ తేదీ 
‎జాతీయ విద్యా దినోత్సవం..సందర్భంగా ‎ఈ వ్యాసం...
‎
‎​అది లాహోర్‌ లో 'అంజుమన్‌ హిమాయత్‌ ఇస్లామ్‌' అనే సాంస్కృతిక సంఘం వార్షికోత్సవ సభ ఆ రోజుల్లో 'లిసానస్ సిదిక్‌' (సత్యవాణి) అనే పత్రిక ప్రచారంలో ఉంది. అందులోని రచనలు, సారూప్య విషయాలు, సంపాదకీయ వ్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అందువలన 'అంజుమన్‌' సంఘం వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడవలసిందిగా ఆ పత్రికా సంపాదకుడిని కోరారు నిర్వాహకులు. అందరూ పత్రికా సంపాదకుని రాక కోసం ఎదురు చూస్తున్నారు.
‎​ఇంతలో నూనూగు మీసాల సన్నని యువకుడు ఒకరు నిరాడంబరంగా వారిని దాటుకుంటూ పోతుంటే ద్వార పాలకులు, నిర్వాహకులు ఆ పిల్లవాడి వివరాలు తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపడి వేదిక మీదకు తీసుకువెళ్లారు. ఆ సభలో అప్పటికే ప్రసిద్ధులైన కవి పండితులు ఎందరో ఆసీనులై ఉన్నారు. వారిలో 'ఖ్వాజా అల్తాఫ్‌ హసన్‌ అలీ' అనే ఉర్దూ మహాకవి, నజీర్‌ అహ్మద్‌, కవి సార్వభౌముడు షేక్‌ మొహమద్‌ ఇక్బాల్‌ మొదలైనవారెందరో ఉన్నారు. అంతలో నిర్వాహకులు ఈ యువకుడే 'లిసానస్ సిదిక్‌' పత్రికా సంపాదకుడు, ఈనాటి ముఖ్య అతిథి అయిన 'మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌' అని పరిచయం చేసి 'దర్మ మీమాంస' అనే విషయంపై ప్రసంగిస్తారు అని చెప్పారు. మౌలానా తన అనర్గళ ప్రసంగంతో ఆనాటి పండితులను మంత్రముగ్ధులను చేశారు.
‎ఆనాడే ప్రముఖులు, పెద్దలు, పండితులు అందరూ కలిసి భారత ముస్లింలకు ఇతడు ఆశా జ్యోతి' అని మౌలానాకు బ్రహ్మరథం పట్టారు.
‎
‎ఆ బాలుని అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ 'అబుల్ కలాం' అనేది ఆయన బిరుదు, 
‎'ఆజాద్'అనేది ఆయన కలం పేరు
‎మౌలానా 1888 నవంబరు 11న సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు.  
‎ఉర్దూ, అరబిక్, పెర్షియన్, ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ భాషలలో మంచి పండితుడు.  
‎మౌలానా మాట్లాడే ఉర్దూనే గాంధీ 'హిందూస్థానీ' అని పిలిచారు. 
‎
‎పత్రికా వ్యవస్థాపకునిగా
‎"అల్-హిలాల్" మరియు "అల్-బలాగ్" అనే విప్లవాత్మక పత్రికలను స్థాపించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు.  
‎​గాంధీజీతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని సుమారు పదేళ్ళం  జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు.
‎అతని కార్యదీక్షా పట్టుదల వలన ముప్పై అయిదేళ్ళ యవ్వన ప్రాయంలోనే 1923  కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతని నాయకత్వ లక్షణాల వలన మరలా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1940 నుండి 1946 వరకు  కొనసాగారు.  
‎ఆయన ​దేశ విభజనను చాలా తీవ్రంగా ఖండించారు.
‎ఆయన హిందూ-ముస్లిం ఐక్యతను గట్టిగా విశ్వసించారు.  మౌలానా మతం గురించి, స్వాతంత్ర్యం గురించి "భారత స్వాతంత్ర్యం ప్రదానమునకు మత విధానమే అడ్డు తగులుతున్నదట. తాము వ్రేలు పెట్టకున్నచో మతము లేదు, వివాదము లేదు, మనలో మనకు కొట్లాటలు లేవు" అంటూ బ్రిటీష్‌ వారిని విమర్శిస్తూ "మానవుని ప్రధాన స్వత్వము స్వాతంత్ర్యం. ఈశ్వరుడు ఇచ్చిన వరము స్వాతంత్ర్యము. ఒరులు యిచ్చెడి  ధర్మమూ, భిక్షా కాదు. దురాక్రమణ, పాపము, దాక్షిణ్యము హరింపదు. యావద్భారత దేశము నా  మాతృభూమిగా భావించుకొను జన్మ హక్కును నేను జారవిడుచుకోలేను. దాని ఆర్థిక, సాంఘిక, రాజకీయ భవిష్యత్‌ ను రూపొందించుకునే స్వతంత్రమైన హక్కును వదులుకోజాలను' అంటూ నిశితమైన అభిప్రాయాలను వెలువరించారు మౌలానా.
‎
‎​స్వాతంత్ర్య భారత దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా  (1947 -1958 వరకూ) సుదీర్ఘంగా పదకొండేళ్ళ పాటు  సేవలందించారు. 
‎ఆయన హయాంలోనే భారతదేశంలో విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు పడ్డాయని చెప్పొచ్చు.
‎ఈనాడు మనం చాలా విలువైనదిగా చెప్పుకునే ఐ.ఐ.టి. లను ప్రాధాన్యత ఆనాడే తెలుసుకొనీ
‎​1951లో భారతదేశంలో మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఖరగ్‌పూర్ లో  ఏర్పాటు చేసారు. 
‎అదే విధంగా ఉన్నత విద్యను క్రమబద్ధీకరించడానికి 1953లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏర్పాటుకు కృషి చేశారు.  
‎ఒక పక్క నాయకునిగా వుంటూనే మన దేశ 
‎​కళలు, సంస్కృతుల పట్ల ఆశక్తి పెంచుకొనీ
‎సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీలను స్థాపించి వాటికి విధులు, నిధులు ఏర్పాటు చేసి భారతీయ కళలు, సాహిత్యానికి పెద్దపీట వేశారు.  
‎
‎అదే విధంగా ​ప్రాథమిక విద్యావశ్యకతను,
‎ బాలికల విద్యావశ్యకతను ప్రోత్సహిస్తూ
‎14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మరియు బాలికల విద్య అభివృద్ధి కోసం సంస్కరణలు తెచ్చారు.
‎మొదటే చెప్పుకున్నాం కదా కలాం మంచి రచయిత
‎మౌలానా తత్త్వజ్ఞానం మీద, సాహిత్యం మీద ఎన్నో గ్రంథాలు రచించారు. తన ఆత్మకథను ఇంగ్లీష్‌ లో 'ఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌' అనే పేరుతో రాశారు.
‎​గుబార్-ఎ-ఖాతిర్ (Ghubar-e-Khatir)  అనే పుస్తకాలు వ్రాసారు.
‎ప్రపంచ మతములను క్షుణ్ణంగా మధించి ఖురాన్‌ కు కొత్త దృక్పథంతో భాష్యము చెప్పిన గొప్ప తత్త్వవేత్తగా పేరొందినారు.
‎
‎1958 ఫిబ్రవరి 22న ఆజాద్ కన్నుమూశారు. 
‎మౌలానా మరణించినప్పుడు 'మౌలానా ​తత్త్వవేత్తల కోవకి చెందినవాడని' రాజకీయ వేత్తలే కాకుండా ప్రసిద్థ రచయితలు కూడా ఆయన సేవలను 
‎కీర్తించారు..
‎​ఆయన మరణించినప్పుడు నేపాల్‌, సిలోన్‌, బర్మా, థాయ్‌ లాండ్‌, ఇండోనేషియా మొదలగు దేశాలు, ఇంగ్లాండ్‌, జర్మనీ, స్వీడన్‌ వంటి రాజ్యాలు, అమెరికా, ఆఫ్రికా ఖండములు 'మౌలానా ఆజాద్‌' ఫీట్‌, ఆస్ట్రేలియా వంటి తత్త్వవేత్తల కోవకి చెందినవాడు' అని తమ సందేశాలను మన దేశానికి పంపాయి.
‎"ముస్లిం ప్రపంచములో విజ్ఞావాత్మకమైన చైతన్యం వెలిగించినవాడు మౌలానా" అని ప్రశంసలు అందుకొన్నారు. 
‎​భారతదేశ ప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ 'ఆజాద్‌ ఒక తేజోవంతమైన మహావ్యక్తి' అని ' ఆజాద్‌ వ్యక్తి జీవితంలో కరుణా సముద్రుడని, ప్రజాహిత జీవితంలో అకుంఠీత దీక్షాపరు'డని శ్లాఘించారు. హిందూ, ముస్లిం సమ్మిళితకు జీవితం మీదు కట్టిన నిష్కామ యోగి' అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరమును ముందు పీఠాన నడచిన గొప్ప వీరుడు అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ , నవభారత నిర్మాణమునకు పునాది వేసిన రాజకీయవేత్త అయిన మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌.
‎
‎మౌలానా స్వాతంత్ర్య భారతదేశానికి మొదటి విద్యా శాఖ మంత్రిగా పని చెయ్యటం మన భారతీయులందరీ గర్వకారణం గా భావిస్తూ
‎మౌలానా చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా 
‎​ఆయన జన్మదినమైన నవంబరు  పదకొండొవ తేదిని ప్రతి సంవత్సరం భారతదేశంలో "జాతీయ విద్యా దినోత్సవం" (National Education Day) గా పాటించడం నిజంగా ఆయనకు మనం అర్పించే నిజమైన జోహార్లు.
‎
‎​1992లో భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' ను అందించి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటూ ఆ స్మరణీయుని సేవలను కొనియాడుతున్నది జాతి మొత్తం..
‎​ఈ రోజున దేశవ్యాప్తంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ విద్యా రంగంలో నిష్ణాతులైన గురువులను గౌరవించుకొంటూ, తరాలను తీర్చిదిద్దే పనిలో అహరహమూ కృషి చేసిన, చేస్తున్న గురువులందరికీ ఆ మహానీయుని పేరుతో..
‎శ్రీ గురుభ్యోనమః...
‎
‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 
‎సెల్ :: 8247433432