BREAKING
సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్ విడుదల.. సరిహద్దుల్లో వైవిధ్యమైన పోరాటంతో అంచనాలు పెంచిన భాయ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించిన నంద్యాల జిల్లా పోలీసులు-ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఇట్లు అర్జున హీరో అనీష్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? టాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ వెనుక అసలు నిజాలు ఇవే! మళ్లీ తుఫాను ముప్పు ప్రియా భవానీ శంకర్ ఇంట పెళ్లి సందడి.. ప్రియుడితో ఏడడుగులు వేసిన ప్రముఖ నటి మాలధారులకు దుస్తుల అందజేత విమానంలో హైజాక్ బెదిరింపు లేఖ కుందుర్పి లో మేకను చంపి తిన్న చిరుతపులి. ఇంద్రకీలాద్రి అమ్మవారి అన్నదానం పథకానికి లక్ష రూపాయలకు పైగా విరాళం విద్యా రంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం గౌరవప్రదమైన ఆత్మీయ కలయిక… జాతీయ మూల్యాంకనానికి విద్యార్థులను సిద్ధం చేయాలి ఉపాధ్యాయులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన కలెక్టరేట్‌లో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సొంత పార్టీ ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం విజయ్ సీరియస్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. క్రీడలకు దగ్గరవ్వాలి

ఆదర్శప్రాయుడు "మౌలానా అజాద్ "

Select Suryaa Now
ఆదర్శప్రాయుడు "మౌలానా అజాద్ "

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : 
నేటి యువతకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శప్రాయమని ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ మేవా నాయకులు పేర్కొన్నారు. మౌలానా ఆజాద్ జన్మదినోత్సవం సందర్భంగా మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
బుధవారం ఉదయం అనంతపురం టవర్ క్లాక్ వద్ద మౌలానా ఆజాద్ విగ్రహానికి ఆల్ మేవా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షే క్ షా వలి ప్రధాన కార్యదర్శిఫరూక్ లు మాట్లాడుతూ  మౌలానా ఆజాద్ సౌదీ అరేబియాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలో  జన్మించారని సమాజంలోని ప్రతి ఒక్కరూ చదవాలనే తపించిన మహనీయుడని తెలిపారు.

నేడు మన భారతదేశం వ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవం తో పాటు, స్వాతంత్ర్య యోధులు, భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి, భారత రత్న మౌలానా అబుల్ కలామ్అజాద్ గారి  జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతున్నదని అన్నారు.
మన దేశంలో ఆనాడు  విద్యా శాఖకు ఆజాద్ చేసిన సేవలు ఎనలేనివని విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాదే అని పేర్కొన్నారు.
ముఖ్యంగా  భారతదేశంలో ఉన్నత విద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావ డంలో ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం. అందువల్లనే ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఆయన జన్మదినం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. విద్యారంగంలో వారికి ఉన్న అపారమైన జ్ఞానం దేశంలోని విద్యార్థులకు ఆదర్శప్రాయం అని అన్నారు. ప్రజలకు ఇలాంటి మహానుభావులు చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయన్నారు. అలాగే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి మహాత్మా గాంధీజీ, బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు పాటిస్తూ స్వాతంత్ర సంగ్రామ   ఉద్యమంలో కూడా ఇష్ట సేవలంది దేశభక్తి చాటుకుని గొప్ప దేశభక్తినిగా నిలిచారన్నారు.
11 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వ విద్య శాఖకు మంత్రిగా సేవలందించి  విద్యాసంస్కర్తగా గుణాత్మక విద్యకు మార్గదర్శిగా విద్య వల్లనే అభివృద్ధి సాధ్యమని విద్యయే గురువుగా నమ్మిన సిద్ధాంతుడు మౌలానా ఆజాద్. నేటి యువత వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబుల్ కలాం అంటే భాష జనకుడని అర్థం. తన కలం పేరు ఆజాద్ గా మలిచి ఎన్నో దేశభక్తి కవితలను రచనలను రచించి ప్రజలను చైతన్యపరిచి దేశభక్తిని పెంపొందించిన గొప్ప దేశభక్తుడు ఆజాద్ అని తెలిపారు.
విద్యకు విశిష్టమైన కృషి అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్  జాతికి అందించిన సేవలు మనందరికీ స్ఫూర్తిదాయకం ఆదర్శప్రాయమని ఆల్ మేవా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆల్ మెవ సహా అధ్యక్షులు ఫక్రుద్దీన్, సీనియర్ నాయకులు మక్బూల్, ఫైనాన్స్ సెక్రటరీ దౌ లా, ఉపాధ్యక్షులు జిలాన్, మహబూబ్ బాషా  తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.