BREAKING
చింతలమానేపల్లిలో K Tech 1325HD CNC రూటర్ మెషిన్ ప్రారంభం కూటమి అక్రమాలను అధిగమించి వైఎస్సార్‌సీపీ పోరాడింది: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండో ప్రెగ్నెన్సీతో మెరిసిపోతున్న కియారా అద్వానీ.. కాఫీ విత్ కరణ్ షోలో బేబీ బంప్‌తో సందడి! హాలీవుడ్ ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ జోబ్ సెర్నీ కన్నుమూత.. 78 ఏళ్ల వయసులో మృతి ఎనిమిదేళ్ల వయసులోనే రోజువారీ కూలీగా పని.. చదువుకోలేకపోయానంటూ మునావర్ ఫరూఖీ భావోద్వేగం! కష్టాల్లో ఉన్నవారిని వేధించడం అమానుషం.. రేణు దేశాయ్ భావోద్వేగ పోస్ట్ వైరల్! నకిలీ పత్రాలతో ICICI బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా.. సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం సల్మాన్ ఖాన్ పడిన శ్రమ, త్యాగాలు నాకు తెలుసు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి భావోద్వేగ ట్వీట్ ఫేక్ పోస్టులపై స్పందించిన రోహిత్ శెట్టి.. ఆ సోషల్ మీడియా ఖాతాలతో తనకు సంబంధం లేదంటూ క్లారిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి* రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి కుందుర్పి జడ్పీటీసీగా ధ్రువీకరణ పత్రం అందుకొన్న  ప్రభావతి.*  హెచ్.ఎన్.ఎస్.ఎస్. నీటి విడుదల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* హాలీవుడ్ ప్రముఖ నటుడు స్టేసీ కీచ్ కన్నుమూత.. 85 ఏళ్ల వయసులో తీవ్ర గుండెపోటుతో మృతి

డైరీ ఫామ్‌లో ఉద్యోగం పోయిందనే కక్షతో తోటి కార్మికుడి దారుణ హత్య!

Select Suryaa Now
డైరీ ఫామ్‌లో ఉద్యోగం పోయిందనే కక్షతో తోటి కార్మికుడి దారుణ హత్య!

కంకిపాడు, మేజర్ న్యూస్: కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పునాదిపాడు ఫ్లైఓవర్ అండర్‌పాస్ సమీపంలో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన రాకేష్ కుమార్ (28), మనీష్ కుమార్ (25)లను నవంబర్ 10న అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కడలి జయకృష్ణ తెలిపారు. బుధవారం కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీ రాజ్యలక్ష్మి డైరీ ఫామ్‌లో పనిచేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ (26) నవంబర్ 9వ తేదీ తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు నిందితులు కోడికత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 8.45 గంటలకు మృతి చెందాడు. గతంలో ఇదే డైరీ ఫామ్‌లో పనిచేసిన రాకేష్ కుమార్ విధుల పట్ల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. అతని స్థానంలో అనిల్ కుమార్‌ను నియమించడంతో కక్ష పెంచుకున్న రాకేష్, తన స్నేహితుడు మనీష్ కుమార్‌తో కలిసి హత్యకు పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. నేరానికి ఉపయోగించిన రెండు కోడికత్తులు, హోండా యాక్టివా, రెండు సెల్‌ఫోన్లు, నాలుగు దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చలివేంద్రపాలెం పరిధిలోని జాతీయ రహదారిపై డైరీ 9 ఐస్‌క్రీమ్ కంపెనీ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్నట్లు భావిస్తున్న మూడో వ్యక్తి అనీష్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సమావేశంలో సీఐ బి.బి. రవికుమార్, ఎస్ఐ దాసు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.