BREAKING
బోందిడిలో దూడలకు నట్టల మందుల నివారణ పంపిణీ జిల్లాలో 8,209 మందికి కొత్తగా భృతి మంజూరు..ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో భృతి నగదు జమ కొమురం భీమ్ మనుమడు మృతి బాధాకరం - ఎమ్మెల్యే కోవ లక్ష్మి బ్రహ్మాసముద్రం లో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. ఎమ్మెల్యే అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్‌లో చేరిన కుమారి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సర్వే విభాగం ఆధునికీకరణకు శ్రీకారం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు యాటకలు విద్యార్థులు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందించేందుకు చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి రేణిగుంటలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం వాల్ మార్ట్ వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ జి. లింగాపురం ఎంపీటీసీ షాహిదాకు ఎమ్మెల్యే బుడ్డా ఆశీస్సులు పల్నాడు జిల్లాలో పంచాయతీఎన్నికలకు సర్వం సిద్ధం ఎస్పీ జగదీష్ ఆదహళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధం అభివృద్ధి పనులలో పురోగతి సాధించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత

నకిలీ పత్రాలతో ICICI బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా..

Select Suryaa Now
నకిలీ పత్రాలతో ICICI బ్యాంక్‌కు రూ.30 లక్షల టోకరా..
 రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ શાಖలో భారీ పర్సనల్ లోన్ మోసం వెలుగు చూసింది. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, పే-స్లిప్పులతో ఒక ముఠా బ్యాంక్‌ను బురిడీ కొట్టించి రూ.30 లక్షల వ్యక్తిగత రుణం పొందినట్లు పోలీసులు గుర్తించారు.

మోసం సాగిందిలా: ముఠా సభ్యులు బెంగళూరులోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, శాలరీ స్లిప్పులను సృష్టించారు. వాటితో పాటు ఫేక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తయారు చేసి బ్యాంక్‌లో సమర్పించారు. వీటి ఆధారంగా రూ.30 లక్షల పర్సనల్ లోన్ మంజూరు చేయించుకోవడంతో పాటు క్రెడిట్ కార్డు పొంది లక్షలాది రూపాయలు డ్రా చేశారు.

విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి ఈ మోసానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాల తయారీ వెనుక ఎవరి హస్తం ఉంది, బ్యాంక్ సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.