BREAKING
తన వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో పావుగా మారిన కల్వకుంట్ల కవిత. ఘనంగా నాగుల చవితి వేడుకలు ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి! ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు నైజీరియాలో ముగిసిన 21 రోజుల ఎబోలా కాంటాక్ట్ మానిటరింగ్ గ్రామపంచాయతీ ఎన్నికలు కోసం స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందించేందుకు చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందించేందుకు చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందించడంతో పాటు, లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సోన్ మండలం సంగెంపేట్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లకు అవసరమైన అన్ని సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని సూచించారు.ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలని, తద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే, జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ విబిజి రామ్ జీ పథకం ద్వారా ఉపాధి పనులు పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో రామకృష్ణ, హౌసింగ్ డీఈ గంగాధర్, సర్పంచ్ విలాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.