BREAKING
నిమ్స్‌లో రూ.100 కోట్ల స్కామ్‌పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్.. కొండపోచమ్మసాగర్, కాళేశ్వరం పనులపై నిలదీత వైభవంగా మణవాళ మహామునుల వర్ష తిరు నక్షత్ర మహోత్సవం 108 అంబులెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు భర్తని పిలుస్తుంటే ఇప్పటికీ క్యూట్‌గా ఉంది.. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవికి నటి అహానా కృష్ణ బర్త్ డే విషెస్ అండూరులో ఉచిత పశువైద్య శిబిరం యాచారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి *పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లపైనే భారీ వాహనాల పార్కింగ్* అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల దుర్మరణం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం బాలలు ఆనందంగా బాల్యాన్ని గడపాలి దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పల్లె పోరు అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల వాసికి స్థానం* సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అనిల్‌కు ఘన సన్మానం

ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. నవంబర్ 14 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..పథకం విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ కె. హైమావతి

Select Suryaa Now
ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. నవంబర్ 14 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు..  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..పథకం విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట, మేజర్ న్యూస్ ప్రతినిధి. ; రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతం చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యశ్రవణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధివిధానాలు, అమలు తీరు, నమోదు ప్రక్రియ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కులమతాలు, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు.నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్లు సమన్వయంతో చేపట్టాలని సూచించారు.

రేషన్ కార్డులు లేని కుటుంబాలకూ అవకాశం..

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వేలో సేకరించిన కుటుంబాల వివరాలు, పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న రేషన్ కార్డుల సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కుటుంబాల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలను కూడా సర్వే ఆధారంగా పరిశీలించి పథకం పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాలు, పురపాలక సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నమోదు కేంద్రాల వివరాలు, తేదీలు, సమయాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని తెలిపారు.

నామినీల ఎంపికపై స్పష్టమైన అవగాహన కల్పించాలి..

బీమా మొత్తానికి ఒకరిని లేదా ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కుటుంబాలకు కల్పించినట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకుంటే తమకు నచ్చిన విధంగా బీమా మొత్తాన్ని పంపిణీ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.దరఖాస్తుల నమోదు అనంతరం అందులోని వివరాలను కుటుంబ సభ్యులకు పూర్తిగా చదివి వినిపించి, వారికి అర్థమయ్యేలా వివరించిన తర్వాతే సంతకాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాము ఏ పథకం కోసం సంతకం చేస్తున్నారో, ఎవరిని నామినీలుగా ఎంపిక చేసుకున్నారో ప్రతి కుటుంబానికి స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

నవంబర్ 14 నుంచి విస్తృత ప్రచారం..

నవంబర్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, పురపాలక సంఘాలు, పురపాలక సంస్థల పరిధిలోని ప్రతి కుటుంబానికి పథకం లక్ష్యాలు, ప్రయోజనాలు, నమోదు విధానం, నామినీల ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.నవంబర్ 17, 18 తేదీల్లో ప్రజలకు పథకం అమలు, నమోదు ప్రక్రియపై ముందస్తు సమాచారం అందించాలని, అవసరమైన ప్రచార సామగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి కుటుంబానికి పథకం సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకం విజయవంతానికి జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నమోదు ప్రక్రియలో కచ్చితత్వం పాటించాలి..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను పూర్తిగా అంతర్జాల ఆధారితంగా రూపొందించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలు, బీమా ప్రయోజనం పొందే వారి వివరాలు, నామినీల సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.నవంబర్ 19 నుంచి తదుపరి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నమోదు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. పథకం విధివిధానాలపై ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత శాఖల అధికారుల ద్వారా నివృత్తి చేసుకొని, అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.

సిద్దిపేట జిల్లా నుంచి ముఖ్యమంత్రి ప్రారంభం…

ఈ దృశ్యశ్రవణ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టామని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమేష్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.