BREAKING
పాకిస్థాన్‌ను ఆదుకున్న సౌద్ షకీల్.. శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత పోరాటం! రేపు పాఠశాలలకు సెలవు రద్దు కూటమి తరపున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా 'పాలూరి' -- అధికారికంగా ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు వీకే కోల్ మైన్స్‌లో బదిలీలపై బ్రేక్.. ఏపీ పంచాయతీ పోరు షురూ అక్రమ పార్కింగ్ చెక్ యాదగిరి వ్యవహారశైలితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటూ అనిల్‌రెడ్డి వర్గీయుల విమర్శలు పల్లె పోరులోను కూటమిదే విజయం --ఏలూరు అభివృద్ధికి నిధులు రాబట్టడంలోనూ విజయం భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పీవికే-5 కార్మికులకు అండగా మంత్రి పొంగులేటి నీటి ప్రాజెక్టును పరిశీలించిన కార్పొరేటర్ బుడుమూరి కార్పొరేటర్ ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావుకు సత్కారం కార్పొరేషన్ ఎన్నికలపై వైసిపి కసరత్తు కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్

పల్లె పోరు అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి

Select Suryaa Now
పల్లె పోరు అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి

 

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. శుక్రవారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత స్థానిక సంస్థలు, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు, దాడులు మళ్లీ చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గత స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా అనేక అడ్డంకులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో లాఠీచార్జీలు, రాళ్ల దాడులు జరిగాయని, అధికార యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. అధికారుల సహకారంతోనే కూటమి నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఏర్పడే రాజకీయ విభేదాలు ఘర్షణలకు దారితీయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. ఓటు విలువను గుర్తించకుండా డబ్బులకు ఓటు అమ్ముకునే ప్రజలను చైతన్యపరచాలా, ఓట్లు కొనుగోలు చేసే నాయకుల్లో మార్పు తీసుకురావాలా, లేక ఓటు హక్కు వినియోగానికి అడ్డంకులు సృష్టించే అధికార యంత్రాంగాన్ని మార్చాలా అన్నది మేధావులు ఆలోచించాలని అన్నారు. మున్సిపల్, ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగినట్లు నామినేషన్ పత్రాలను ధ్వంసం చేయడం, నామినేషన్లు వేసేందుకు వెళ్లే అభ్యర్థులపై లాఠీచార్జీలు చేయడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా చూడాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి చర్యలకు సహకరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్‌, యలవలి శేఖర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా