BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

ఏపీ పంచాయతీ పోరు షురూ

Select Suryaa Now
ఏపీ పంచాయతీ పోరు షురూ
  • ఏకగ్రీవ గ్రామాలకు రూ.50 లక్షల వరకు నజరానా
విశాఖపట్నం, సూర్య: 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రవ్యాప్తంగా 13,168 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ప్రభుత్వం భారీగా పెంచింది.

ఏకగ్రీవమైతే ఎంత వస్తుందంటే..
- 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీకి రూ.15 లక్షలు
- 5,001 నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీకి రూ.25 లక్షలు
- 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీకి రూ.50 లక్షల ప్రోత్సాహకం

అయితే సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవం కావాల్సి ఉంటుంది.

మూడు విడతల్లో ఎన్నికలు..
- తొలి విడతలో 4,180 పంచాయతీలకు నవంబర్ 26న పోలింగ్
- రెండో విడతలో 4,715 పంచాయతీలకు నవంబర్ 29న పోలింగ్
- మూడో విడతలో 4,273 పంచాయతీలకు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నారు

మొత్తం 13,354 పంచాయతీల్లో 186 పంచాయతీలకు వివిధ కారణాలతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు.

గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మాత్రమే ప్రోత్సాహకాలు ఉండగా.. ఇప్పుడు గరిష్ఠంగా రూ.50 లక్షలకు పెంచడం చర్చనీయాంశంగా మారింది.

గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.. ఏకగ్రీవాల దిశగా అడుగులు పడతాయా? లేక పల్లెల్లో రాజకీయ పోరు హోరాహోరీగా సాగుతుందా? వేచి చూడాలి.