అక్రమ పార్కింగ్ చెక్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంజాతీయ రహదారిపై అనధికారికంగా వాహనాలు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. అమలాపురం - భట్నవల్లి వై జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన నాలుగు లారీలు, ఒక బస్సుపై మోటార్ వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసి మొత్తం రూ.15 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. 216 జాతీయ రహదారిపై ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేయడం వల్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.రవాణా వాహనాలను కొమనాపల్లి వద్ద నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.216 జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్‌ను అరికట్టేందుకు రవాణాశాఖ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు కౌశిక్, వరప్రసాద్ పాల్గొన్నారు.