BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

పల్లె పోరులోను కూటమిదే విజయం --ఏలూరు అభివృద్ధికి నిధులు రాబట్టడంలోనూ విజయం

Select Suryaa Now
పల్లె పోరులోను కూటమిదే విజయం  --ఏలూరు అభివృద్ధికి నిధులు రాబట్టడంలోనూ విజయం

ఏలూరు, మేజర్ న్యూస్ :ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడంతో పాటూ నిధులు రాబట్టడంలోనూ విజయం సాధిస్తూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదంతా ప్రజల అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నగర, పురపోరుతో పాటూ పరిషత్‌ పోరులోనూ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదేక్రమంలో పార్టీలకు అతీతంగా జరిగే పల్లెపోరులోనూ కూటమి మద్దతుదారులే విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనేక స్థానాలను ఏకగ్రీవాలు చేసి గ్రామాల్లో సుహృద్భావ వాతావరణాన్ని కల్పించేందుకు కృషిచేయాలని స్థానిక నాయకత్వాన్ని ఇప్పటికే ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఏలూరుకు మంజూరైన 21కోట్ల అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ గ్రాంట్స్‌ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నిధుల మంజూరు కోసం తాను శ్రమించిన విధానాన్ని వివరించిన ఎమ్మెల్యే చంటి,,, అడిగిన వెంటనే నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుతో పాటూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కోడ్‌ అడ్డంకి లేకుంటే ఈ 21కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానించనున్నట్లు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు జుంజు మోజెస్‌, మల్లెపు రాము, త్రిపర్ణ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.