BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్

Select Suryaa Now
కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్

కౌడిపల్లి;మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో శుక్రవారం టీబీ (క్షయ) స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ శిబిరంలో కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాలకు చెందిన మొత్తం 274 మందికి టీబీ నిర్ధారణలో భాగంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించినట్లు కౌడిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పి. శ్రీకాంత్ తెలిపారు.ఈ స్క్రీనింగ్ క్యాంపును డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించడంతో పాటు వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ తక్షణమే అవసరమైన మందులు అందించి, పూర్తిస్థాయిలో చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీబీ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీబీ స్క్రీనింగ్ టెక్నీషియన్లు మహేష్ (ఎస్‌టీఎస్), రాజు (ఎస్‌టీఎల్‌ఎస్), పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ ఫర్నాజ్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.