BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

కార్పొరేషన్ ఎన్నికలపై వైసిపి కసరత్తు

Select Suryaa Now
కార్పొరేషన్ ఎన్నికలపై వైసిపి కసరత్తు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహా లకు పదును పెడుతోంది. ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి కార్పొరేషన్‌పై పట్టు సాధించాలనే లక్ష్యంతో డివిజన్ల వారీగా క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలోను, వెంకటనగరంలోనూ నాయకులతో కలిసి కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేపట్టారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ యువజ న విభాగం రాష్ట్ర అధ్యక్షు డు జక్కంపూడి రాజా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభా గం మాజీ రీజనల్ కోఆర్డి నేటర్ జక్కంపూడి గణేష్, ఇతర ముఖ్య నాయకు లు పాల్గొన్నారు. రాజమ హేంద్రవరం రూరల్, రాజానగరం నియోజక వర్గాల పరిధిలోకి వచ్చే 30 డివిజన్లకు సంబం ధించి స్థానిక నాయకుల తో సుదీర్ఘంగా చర్చిం చారు.

అభ్యర్థుల ఎంపికలో కేవలం వ్యక్తిగత పరిచ యాలు, పార్టీ పట్ల విధేయత మాత్రమే కాకుండా సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, స్థానికంగా ప్రజల్లో ఉన్న ఆదరణ, ఆర్థిక, రాజకీ య సామర్థ్యం, ఎన్నికల నిర్వహణలో అనుభవం, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే శక్తి వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోం ది. ఆయా డివిజన్లలో పార్టీకి ఉన్న అనుకూల తలు, ప్రతికూలతలు, గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థి తులను కూడా నాయకు లు విశ్లేషించారు.

ముఖ్యంగా కూటమి పార్టీల తరఫున బరిలో నిలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల సామాజిక, రాజకీయ బలాబలాలను అంచనా వేస్తూ, వారికి ధీటైన అభ్యర్థులను ఎంపిక చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుం టూనే, ప్రతి డివిజన్‌లో గెలుపు అవకాశాలను విడివిడిగా బేరీజు వేసుకున్నారు.

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మొత్తం 72 డివిజన్లు ఉండగా, ప్రస్తుత కసరత్తులో రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల పరిధి లోని 30 డివిజన్లపై కసరత్తు కొనసాగుతుంది. డివిజన్ల వారీగా ఖరారైన రిజర్వేషన్లు అనుసరించి బలమైన  అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు.