BREAKING
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక

కార్పొరేటర్ ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావుకు సత్కారం

Select Suryaa Now
 కార్పొరేటర్ ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావుకు సత్కారం

ఆరిలోవ, సూర్య: జీవీఎంసీ, 16వ వార్డు దారపాలెం సమీపంలోని కామాక్షి నగర్‌లో కొలువై ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారికి మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కామాక్షి అగ్నికుల క్షత్రియ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి 16వ వార్డు కార్పొరేటర్  ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు దంపతులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు మాట్లాడుతూ, కార్పొరేటర్‌గా విజయం సాధించిన అనంతరం మొట్టమొదటిసారిగా కామాక్షి నగర్‌లో కొలువై ఉన్న  శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో 16వ వార్డు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ కార్పొరేటర్ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అగ్నికుల క్షత్రియ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రాములవారి చిత్రపటాన్ని కార్పొరేటర్ దంపతులకు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. సంఘం పెద్దలు, సభ్యులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. అమ్మవారి కృపతో  వార్డు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో  వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి, ఉపాధ్యక్షులు మారిక జక్కన్న, కెల్లంశెట్టి శ్రీనివాసరావు, నాయకులు తోరోతు రాజు, ఎస్.ఆర్.వి.వి. ప్రసాద్, పెన్మత్స రాంబాబు, వర్మ అప్పారావు, శ్రీనివాసరావు, గలాల రమణమూర్తి, పండా ప్రసాద్, మాసాబత్తుల శ్రీనివాసరావు, రామారావు, కనకల శ్రీను, ఓశెట్టి పైడిరాజు, నెల్లి అప్పారావు, కామాక్షి నగర్ గ్రామ అధ్యక్షులు తాడి రాజారావు, ప్రసంగి బ్రహ్మాజీ తదితరులతో పాటు అధిక సంఖ్యలో సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.