BREAKING
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక

పీవికే-5 కార్మికులకు అండగా మంత్రి పొంగులేటి

Select Suryaa Now
పీవికే-5 కార్మికులకు అండగా మంత్రి పొంగులేటి

పీవికే-5 కార్మికులకు అండగా మంత్రి పొంగులేటి
- సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- మంత్రిని కలిసిన పీవీకే జనరల్ అసిస్టెంట్లు..
- రజాక్‌ను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి పొంగులేటి

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పీవీకే  జనరల్ అసిస్టెంట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి సర్క్యులర్ విడుదల కావడానికి ప్రత్యేక చొరవ తీసుకుని సహకరించిన మంత్రికి కార్మికులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జనరల్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, కార్మికులను ఐక్యంగా ముందుకు నడిపించిన ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్‌ను మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. అనంతరం సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా ఎంపిక కానున్న పీవీకే కార్మికులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చిలకల రాజయ్య, సకినాల సమ్మయ్య, మల్లరపు కొమరయ్య, జల్లి కిరణ్, నాగేశ్వరరావు, గురుమూర్తి, లగ్గాల అజయ్, పి. వినోద్, ఈశ్వర్, మహేష్, ఉపేందర్ రెడ్డి, అనిల్, సంతోష్ పసి, అన్వర్, హమీద్, రవికాంత్, మురళి, పూర్ణచందర్, చింటూ, రాకేష్, శివ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.