BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

యాదగిరి వ్యవహారశైలితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటూ అనిల్‌రెడ్డి వర్గీయుల విమర్శలు

Select Suryaa Now
యాదగిరి వ్యవహారశైలితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటూ అనిల్‌రెడ్డి వర్గీయుల విమర్శలు

వర్గల్;వర్గల్ మండల కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గీయులు, మరో వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఫ్లెక్సీల దహనం ఘటనతో కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి.మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మల్లారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఓ కాంగ్రెస్ నాయకుడు నిప్పంటించిన ఘటన వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్‌రెడ్డి గౌరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం తాను చేసిన సేవలను మీడియా సమావేశంలో వివరించారు.అనంతరం నర్సారెడ్డి వర్గీయులు సైతం మీడియా సమావేశం నిర్వహించి అనిల్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రస్థాయి నాయకులతో ఫొటోలు దిగుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించడమే కాకుండా, అనిల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో గంజాయి మొక్క అంటూ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనిల్‌రెడ్డి అనుచరులైన యూత్ కాంగ్రెస్ నాయకులు మరో మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా స్పందించారు. పార్టీలో కొందరి వ్యవహారశైలి చీడపురుగుల మాదిరిగా మారిందని, ముఖ్యంగా దాసరి యాదగిరి వ్యవహారంతో పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని విమర్శించారు. పంచాయతీ పెట్టి చివరకు బాధ్యతల నుంచి తప్పుకునే వ్యక్తిగా యాదగిరిని అభివర్ణించారు.మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ, పార్టీ ఇచ్చే ప్రతి పిలుపునూ ప్రజల్లోకి తీసుకెళ్లి కష్టపడుతున్న నాయకుడు అనిల్‌రెడ్డి అని వారు పేర్కొన్నారు.ఎన్నో ఏండ్లు గా మండలంలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తూ తనకు తోచిన సహాయం చేస్తున్నాడని తెలిపారు.అలాంటి నాయకుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.